జీవితంలో రనౌట్ కావొద్దు.. మాచన రఘునందన్ సూచన

by Sathputhe Rajesh |   ( Updated:2022-03-09 02:16:23.0  )
జీవితంలో రనౌట్ కావొద్దు.. మాచన రఘునందన్ సూచన
X

దిశ, తెలంగాణ బ్యూరో: పొగాకు పగాకు అని, ధూమపానంకు ప్రాణo బలి చేయొద్దని తెలంగాణ పద్మశాలి అఫిషియల్స్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ,(టీ పోపా) భాగస్వామ్య పింఛను పథకం ఉపాధ్యాయ ఉద్యోగ సంఘం (సీపీఎస్ టీ ఈ ఏ టీ ఎస్) రాష్ట్ర ప్రచార కార్యదర్శి ,పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ హితవు చెప్పారు. బుధవారం నాడు అంతర్జాతీయ ధూమపాన వ్యతిరేక దినోత్సవంను పురస్కరించుకుని రిసోర్స్ సెంటర్ ఫర్ టుబాకో కంట్రోల్ (అర్ సీ టీ సే) పొగాకు రహిత సమాజం ,పొగాకు రహిత తరం ఆన్న అంశంపై జాతీయ స్థాయి అవగాహన సదస్సు ను విర్చ్యూవల్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య వక్త గా "మాచన" పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ..యువత తెలిసో తెలియకో పొగాకు అలవాటు అనే ఊబి లో చిక్కిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

చక్కటి శక్తి, సామర్థ్యాలు, యుక్తి ఆపార మేధో సంపత్తి ఉన్న యువత తమ భవితను అకారణంగా పొగాకుతో పొగచూరనివ్వవద్దని హితవు చెప్పారు. పొగాకు ధూమపానం అలవాట్లతో తమ జీవితాల్ని చిద్రం చేసుకోవడమే గాక కన్న వారిని మానసిక క్షోభకు గురి చేయవద్దని అభ్యర్ధించారు. పొగాకు, ధూమపానం అలవాట్లతో జీవితంలో రనౌట్ అయ్యే అవకాశం ఉందని అన్నారు. అలా కాకుండా మానసిక ధృఢ చిత్తంతో జీవితంను పొగాకు చేత ఓటమి పాలు కాకుండా విజేతగా నిలబెట్టాలని ప్రాధేయపడ్డారు. సరదాగా మొదలయ్యే ధూమపానం అలవాటుతో జీవితానికే యావజ్జీవ శిక్ష పడేలా వ్యసనపరులు కావద్దని సూచించారు.

పొగాకు లేదా ధూమపానం ఎప్పటికప్పుడు ప్రభావం చూపకున్నా.. తదనంతరం మాత్రం కచ్చితంగా నివారించలేని ప్రమాదానికి జీవితం గురయ్యేలా చేస్తాయన్నారు. అందుకే చికిత్స కంటే నివారణ ఉత్తమం ఆన్న తరుణోపాయంతో మెలకువగా ఉండాలని "మెళకువ" చెప్పారు. స్నేహితులు అంటే హితవు కోరే వారు అని అర్దం కాగా.. వారే తమ మిత్రులను దమ్ము కొట్టడానికి పురి కొల్పడం భావ్యం కాదన్నారు. చేతనైతే చెడ అలవాట్లను ప్రోత్సహించకుండా ఉండటమే గాక..ఉన్నత లక్ష్యాల సాధన కోసం, మైత్రి బంధం తో "మేళ్లు" కలిగేలా సమున్నత ఆలోచన ధోరణి కలిగి ఉండాలని స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed