BAC Meeting: బీఏసీ సమావేశంలో బిగ్ ట్విస్ట్.. బీఆర్ఎస్, ఎంఐఎం వాకౌట్

by Shiva |
BAC Meeting: బీఏసీ సమావేశంలో బిగ్ ట్విస్ట్.. బీఆర్ఎస్, ఎంఐఎం వాకౌట్
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ సమావేశాలపై (Assembly Sessions) స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Gaddam Prasad Kumar) అధ్యక్షతన ఆయన ఛాంబర్ (Speaker Chamber‌)లో బీఏసీ సమావేశం (BAC Meeting) నిర్వహించారు. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తో సహా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య హజరయ్యారు. ఇక విపక్షాల నుంచి బీఆర్ఎస్ (BRS) తరుఫున హరీశ్‌రావు (Harish Rao), వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) హాజరయ్యారు. బీజేపీ (BJP) నుంచి ఎమ్మెల్యే పాయల్ శంకర్ (Payal Shankar), సీపీఐ (CPI) నుంచి కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasiva Rao), ఎంఐఎం (MIM) నేత అక్బరుద్దీన్ (Akbaruddin) ఓవైసీ బీఏసీ సమావేశానికి హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీఏసీ సమావేశం నుంచి బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు వాకౌట్ చేశాయి. అసెంబ్లీ పని దినాలపై స్పష్టతను ఇవ్వలేదని.. అందుకే బీఏసీ సమావేశం నుంచి వాకౌట్ చేశామని హరీశ్ రావు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed