- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బీజేపీపై బాబూ మోహన్ సీరియస్.. పార్టీని వీడటంపై త్వరలోనే నిర్ణయం
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ బీజేపీ నేత బాబూ మోహన్ కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తన కుమారుడికి టికెట్ ఇస్తామని చెబుతున్నారని, కానీ ఈ విషయం తనకు చెప్పడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. టికెట్ల కేటాయింపు విషయంలో దాపరికం తనకు నచ్చడం లేదని, రాష్ట్ర పెద్దలు కావాలని తనను పక్కన పెడుతున్నారని ఆరోపించారు. అందుకే బీజేపీకి కూడా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని, పార్టీలో ఉండాలా? లేదా? అనే దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని బాబూ మోహన్ స్పష్టం చేశారు.
కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కు ఫోన్లు చేస్తున్నా ఎత్తడం లేదని, తనను కావాలని దూరం పెడుతున్నారని బాబూ మోహన్ అసమ్మతి వ్యక్తం చేశారు. తాను అందరికీ తెలిసిన వ్యక్తిని అని, తన పేరు మొదటి జాబితాలో కనిపించలేదన్నారు. తనను ఎన్నో జాబితాలో పెడతారని బాబూ మోహన్ ప్రశ్నించారు. సీట్ల ఖరారులో దాపరికం అసలు నచ్చడం లేదని, తన కుమారుడికి టికెట్ ఇస్తామంటూ కుటుంబంలో చిచ్చు పెడుతున్నారని అన్నారు. ఇవి తనకు నచ్చక ఈ సారి పోటీ చేయాలని అనుకోవడం లేదని, అధిష్టానం నిర్ణయాన్ని బట్టి త్వరలో కీలక డెసిషన్ ఉంటుందని బాబూ మోహన్ పేర్కొన్నారు.