- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వివాదంలో Megastar Chiranjeevi.. నవరంధ్రాలు మూసుకున్నాడని Trolls !
దిశ, డైనమిక్ బ్యూరో : అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యల చేసిన బైరి నరేష్‌ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించినా ఆ వివాదం చల్లారలేదు. హిందు దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అయ్యప్ప స్వాములు, హిందు సంఘాలు, పలువురు రాజకీయ నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల అయ్యప్ప స్వామి వివాదంలో సీఎం కేసీఆర్ స్పందించకపోవడంపై బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నిజమైన హిందువని చెప్పుకునే కేసీఆర్ ఈ ఘటనపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. తాజాగా, ఈ ఘటనపై పలువురు సినీ ప్రముఖులను నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.
అయ్యప్ప స్వామి మాలను సామన్య ప్రజలే కాదు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు కూడా ధరిస్తుంటారు. అయితే, హీరోలు స్వామి మాలను కేవలం తమ స్వార్థం కోసమే ధరిస్తున్నారని నెటిజన్లు ట్విట్టర్‌లో ట్రోల్స్ చేస్తున్నారు. ఈ మేరకు మెగాస్టార్ చిరంజీవి, హీరో రాంచరణ్, మంచు మనోజ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రముఖ హీరో శర్వానంద్‌లు అయ్యప్ప స్వామి మాల ధరించిన ఫొటోలను షేర్ చేస్తున్నారు. ఫొటోలతో పాటు ఘాటైన క్యాప్షన్లు పెడుతూ హీరోలపై విరుచుకుపడుతున్నారు. కేవలం వారు అయ్యప్ప స్వామి దీక్ష మాత్రమే తీసుకుంటారని.. ధర్మం కోసం, న్యాయం కోసం కాదని మండిపడుతున్నారు. కేవలం వారి స్వార్థ ప్రయోజనాల కోసమే కానీ అయ్యప్ప స్వామిని బహిరంగంగా దూషిస్తే మాత్రం నవరంధ్రాలు మూసుకుని ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే వారికి కేవలం హిందువులే ఫ్యాన్స్ కాదు.. అందరు ఉన్నారు కనుక. ఫ్యాన్స్ హర్ట్ అవుతారని స్పందించట్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవిని టార్గెట్ చేసిన నెటిజన్లు ఆయనపై ఫైర్ అవుతున్నారు. 'మెగాస్టార్ గారికి గరికపాటి విషయంలో ఉన్న శ్రద్ధ అయ్యప్ప స్వామి విషయంలో ఉండదు' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వివాదం నెట్టింట చర్చనీయాంశంగా మారింది.
ఇవి కూడా చదవండి : Golden Globe Awards ఈవెంట్‌కు హాజరవుతున్న 'RRR' Team!