దురుసుతనంతోనే దూరం! అందుకే అబ్జక్షన్

by Sathputhe Rajesh |
దురుసుతనంతోనే దూరం! అందుకే అబ్జక్షన్
X

దిశ, తెలంగాణ బ్యూరో : టీ పీసీసీ అధ్యక్షుడిపై పార్టీ సీనియర్లు మరోసారి ఫైర్ అయ్యారు. ఏ పార్టీలో లేనట్టు అధ్యక్షుడు వర్సెస్ సీనియర్లుగా వివాదం ముదురుతూనే ఉంది. థాక్రే వచ్చిన తర్వాత కూడా పరిస్థితుల్లో మార్పులు రాలేదంటే రేవంత్ నాయకత్వాన్ని సీనియర్లు ఏ స్థాయిలో వ్యతిరేకిస్తున్నారనేది? అర్థం చేసుకోవచ్చు. అధ్యక్షుడి దురుసుతనంతోనే సీనియర్లు అసంతృప్తితో ఉన్నట్టు పార్టీలో చర్చ మొదలైంది. ఇందుకు గతంలో ఓ మాజీ మంత్రిని ఉద్దేశించి హోంగార్డు అని వ్యాఖ్యానించారు.

ఇటీవల మరోనేతను యావరేజ్​నేత అని రేవంత్ సంభోదించారు. ఇలాంటి మాటలే పార్టీకి నష్టాన్ని తెస్తున్నాయని సీనియర్లు అంటున్నారు. మెజార్టీ సీనియర్లు రేవంత్ ​దురుసుతనాన్నే ఎత్తి చూపుతున్నారు. మరోవైపు కొత్తగా పార్టీలోకి వచ్చినోళ్లకు ప్రయారిటీ ఇస్తున్నాడనేది సీనియర్ల వాదన. దీంతోనే ఏఐసీసీ ప్రోగ్రామ్స్ అమలు కమిటీ చైర్మన్​ ఆధ్వర్యంలో సీనియర్లంతా తెలంగాణ పోరుయాత్ర నిర్వహిస్తున్నారని గాంధీభవన్​లో చర్చ నడుస్తున్నది. పార్టీలోని లీడర్లను సమన్వయం చేయడంలో రేవంత్​ఫెయిల్ అవుతున్నాడని ఆ పార్టీ నేతలే పేర్కొంటున్నారు. ఏఐసీసీకి ఇదే విషయం చెప్పామని, కానీ సీరియస్‌గా తీసుకోలేదని ఓ నేత చెప్పారు.

ముఖ్యులంతా ఒక వైపు..

ప్రస్తుత టీ పీసీసీ అధ్యక్షుడిపై మెజార్టీ సీనియర్లు సీరియస్​గానే ఉన్నారు. రేవంత్ నిర్ణయానికి ఏ ఒక్కరూ సంపూర్ణ మద్దతు తెలపడం లేదు. ఇటీవల రేవంత్ ​ప్రారంభించిన జోడో యాత్రలోనూ చాలామంది ముఖ్య లీడర్లు పాల్గొనలేదు. జిల్లాలను ప్రభావం చేసే లీడర్లెవ్వరూ ఆయన వెంట లేరని ఆ పార్టీలోనే ప్రచారంలో ఉంది. కొందరు ఆయనకు మద్దతు ఇస్తున్నా.. మెజార్టీ సీట్లు గెలిపించుకునే సత్తా వారిలో లేదని సీనియర్లు పేర్కొనడం విచిత్రంగా ఉంది. పార్టీ ఏజెండాను ప్రజల్లోకి తీసుకు వెళ్లకుండా సొంత ఇమేజ్​ను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడని కాంగ్రెస్​పార్టీకి చెందిన ఓ మాజీ మంత్రి చెప్పారు.

ఎన్నికల సమీపిస్తుండగా..

గతంతో పోల్చితే కాంగ్రెస్​లో జోష్​ వచ్చిందనే మాట వాస్తవం. కానీ ఈ జోష్ ​తగ్గకుండా పార్టీలోని ముఖ్యులను కలుపుకొని ముందుకెళ్లడంలో రేవంత్ ​ఫెయిల్ అయినట్టు రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్న మాట. రాష్ట్రవ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ​క్యాడర్ బలంగానే ఉంది. కానీ ముఖ్య లీడర్లు నిత్యం కొట్లాటలతోనే అసంతృప్తి ఏర్పడింది. ఎన్నికల సమయంలో ఇది కాంగ్రెస్​కు మరింత నష్టం చేకూర్చేలో ఉంది. సీనియర్లను కలుపుకుని ముందుకెళ్తే మంచి ఫలితాలు వస్తాయని గాంధీభవన్​లో కొందరు నేతల మధ్య నడుస్తున్న చర్చ ఇది.

‘‘ సమస్యల మీద ఫైట్ చేయడం లేదు

బక్క జడ్సన్​ కాంగ్రెస్​సీనియర్​ నేత

రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. కానీ టీపీసీసీ అధ్యక్షుడు వాటిపై పోరాడటంలేదు. కేవలం కేసీఆర్, ఆ కుటుంబాన్ని తిడితే లాభం లేదు. ప్రజల కష్ట, నష్టాలపై ఫైట్ ​చేస్తే పార్టీకి బాగుంటుంది. సీనియర్ల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోడు. టీడీపీ నుంచి వచ్చిన వాళ్లనే నేతలుగా చూస్తున్నాడు. ఇది జాతీయ పార్టీలో సరైన విధానం కాదు. టీ పీసీసీ అధ్యక్షుడు ఇక నుంచి పార్టీ కోసం మేలు జరిగే నిర్ణయాలు తీసుకోవాలి. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే ఉంటా.’’

Advertisement

Next Story