- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అన్నా రేవంతన్న.. జర మమ్మల్ని కాపాడు.. సీఎంను వేడుకుంటున్నా ఆటో డ్రైవర్
దిశ, డైనమిక్ బ్యూరో: అన్నా రేవంతన్న జర మమ్ములను కాపాడు అని ఓ ఆటో వెనుక క్యాప్షన్ రాసి ఉంది. ఇలా రాసి ఉన్న కొన్ని ఆటోలు హైదరాబాద్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఆటో డ్రైవర్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వేడుకుంటున్నారు. అయితే ఇటీవల మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలకు టీఎస్ ఆర్టీసీలో ఉచిత ప్రయాణం తెలంగాణ ప్రభుత్వం కల్పించిన సంగతి తెలిసిందే. దీంతో ఆర్టీసీ బస్సుల్లో మహిళ ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఈ క్రమంలోనే ఆర్టీసీ కూడా బస్సుల సంఖ్య పెంచింది. అయిన కూడా బస్సుల్లో మహిళల రద్దీ ఎక్కువగానే ఉంది.
ఫ్రీ బస్ సర్వీస్ రద్దు చేసి కాపాడు
అయితే ఈ మహాలక్ష్మీ స్కీం వల్ల ఆటో డ్రైవర్లు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ స్కీం వల్ల ఆటోలో ప్రయాణించే వారి సంఖ్య తగ్గిందని ఆటో డ్రైవర్లు చెబుతున్నారు. ముఖ్యంగా ఆటోలు ఎక్కువగా మహిళలు యూస్ చేస్తుంటారు.. ఫ్రీ స్కీం వచ్చాక మహిళలు ఆటోలో ప్రయాణించడం తగ్గించారని, దీంతో తమ ఆర్థిక పరిస్థితి బాగోలేదని డ్రైవర్లు చెబుతున్న మాట. ఈ క్రమంలోనే కొందరు ఆటోలపై ‘అన్నా రేవంతన్న జర మమ్ముల్ని కాపాడు ఫ్రీ బస్ సర్వీస్ రద్దు చేసి మా ఆటో డ్రైవర్లను కాపాడండి’ అని ఆటో వెనుక క్యాప్షన్స్‌తో సీఎంను వేడుకుంటున్నారు.