- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కౌన్సిలర్‌పై మున్సిపల్ వైస్ చైర్మన్ దాడికి యత్నం!

X
దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: కౌన్సిలర్‌పై మున్సిపల్ వైస్ చైర్మన్ దాడికి ప్రయత్నించిన సంఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అల్కాపూర్ 8వ వార్డ్ కౌన్సిలర్ నవీన్ కుమార్ గురువారం ఉదయం స్థానిక పార్క్‌లోకి వస్తున్న మిల్లెట్ వాహనాన్ని కొందరు అడ్డుకున్నారు. అనుమతి తీసుకుని రావాలని సూచించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న మున్సిపల్ వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, బీజేపీ నాయకుడు అంజనీ కుమార్‌లు ఒక్కసారిగా నవీన్ కుమార్‌పై దాడికి యత్నించినట్లు సమాచారం. అసభ్యకర పద జాలంతో దూషించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు నవీన్ కుమార్ ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు.
Next Story