- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తెలంగాణ సెక్రటేరియట్ ముట్టడికి యత్నం.. తీవ్ర ఉద్రిక్తత
దిశ, వెబ్‌డెస్క్: డీఎస్సీని వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ సెక్రటేరియట్ ముట్టడికి బీసీ జనసభ, నిరుద్యోగులు ప్రయత్నంచడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిరుద్యోగులను పోలీసులు అడ్డుకోగా తోపులాట జరిగింది. ఈ సందర్భంగా డీఎస్సీ వెంటనే వాయిదా వేయాలంటూ నిరుద్యోగులు నినాదాలు చేశారు. దీంతో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని డీసీఎంలలో పోలీసు స్టేషన్‌లకు తరలించారు. బీసీ జన సభ నేత రాజారాం యాదవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నిరుద్యోగులు మాట్లాడుతూ.. ఉద్యోగాలు ఇవ్వమంటే ఇవ్వకుండా పోలీసులతో రాజ్యం నడుపుతున్నారని సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. ఒక్క సారిగా నిరుద్యోగులు దూసుకురావడంతో పోలీసులు పరిస్థితిని అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. ఉద్యోగుల ఆందోళనతో ఒక్కసారిగా సెక్రటేరియట్ పరిసర ప్రాంతాల్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.