వణికిస్తున్న కుక్కల దాడులు..

by Sathputhe Rajesh |
వణికిస్తున్న కుక్కల దాడులు..
X

దిశ ,శంకరపట్నం: శంకరపట్నం మండల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. శంకరపట్నం మండల పరిధిలో 24 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గత 10, నుండి15 రోజుల నుండి మండలంలోని కన్నాపూర్, కొత్తగట్టు, మొలంగూర్ గ్రామాలతో పాటు పలు గ్రామాల్లో కుక్కలు దాడులకు పాల్పడుతుండటంతో భయాందోళనలకు గురవుతున్నారు. కొన్ని రోజుల క్రితమే శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామంలో గల సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహంలో ఓ పెంపుడు కుక్క చొరబడి సుమంత్ రెడ్డి అనే బాలుడిపై దాడి చేసింది.

దీంతో మండలంలోని పలు గ్రామాల్లో కుక్కల దాడి వెలుగులోకి వస్తుంది. కొన్ని రోజుల క్రితం కన్నాపూర్ గ్రామంలో గద్దపాక గ్రామానికి చెందిన సురేష్ అనే యువకుడు కన్నాపూర్ మీదుగా గద్దపాకకు వెళ్తుండగా మార్గమధ్యంలోని కన్నాపూర్ గ్రామంలో కుక్కలు దాడి చేయడంతో ఆ యువకుడి తీవ్ర గాయాలయ్యాయి. రెండు రోజుల క్రితం మొలంగూర్ గ్రామపంచాయతీ పరిధిలోని నల్లంగ వెంకయ్య పల్లెకు చెందిన పొద్దుటూరి పూలమ్మ అనే మహిళతో పాటు మరో 10 మందిపై ఓ కుక్క దాడి చేసింది.

కొత్తగట్టు గ్రామంలో మరికొందరిపై కుక్కలు దాడి చేసిన ఘటనలు ఉన్నాయి. దీంతో మండలంలోని పలు గ్రామాలకు చెందిన ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి శంకరపట్నం మండలంలో కుక్కల దాడి నుండి ప్రజలను కాపాడి, నివారణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story