కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి.. ఎమ్మెల్యే గాంధీ సహా 40 మందిపై కేసు నమోదు

by Mahesh |   ( Updated:2024-09-12 16:18:04.0  )
కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి.. ఎమ్మెల్యే గాంధీ సహా 40 మందిపై కేసు నమోదు
X

దిశ, శేరిలింగంపల్లి: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన ఘటనలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో పాటు ఆయన అనుచరులపై గచ్చిబౌలి పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటి వరకు 40 మందిని గుర్తించిన గచ్చిబౌలి పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు. కౌశిక్ రెడ్డి ఉంటున్న కొల్ల విల్లాస్ పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు పరిశీలిస్తున్న పోలీసులు ఎవరెవరు పాల్గొన్నారనే దానిపై ఆరా తీస్తున్నారు. మరింత మందిపై కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సీపీ కార్యాలయంలో బైఠాయించిన బీఆర్ఎస్ నాయకులు

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై దాడి చేసిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కాంగ్రెస్ అనుచరులను అరెస్ట్ చేసేదాకా ఇక్కడ నుంచి వెళ్ళేది లేదని సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో బీఆర్‌ఎస్ నాయకులు భీష్మించుకు కూర్చున్నారు. మాజీ మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్, వివేకానంద గౌడ్, మాధవరం కృష్ణారావు, మాగంటి గోపీనాథ్, శంభీపూర్ రాజు, ఎర్రోళ్ల శ్రీనివాస్ సీపీ కార్యాలయం ఎదుట బైఠాయించారు. అలాగే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దగ్గరుండి దాడిని ప్రోత్సహించిన సీఐ, ఏసీపీలను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

ఈ క్రమంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారని ఎమ్మెల్యే గాంధీతో పాటు, అతని అనుచరులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అలాగే ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్‌ను మాజీ మంత్రి హరీశ్ రావుకు చూపించిన పోలీసులు.. ఆయనను సీపీ ఆఫీస్ నుంచి వెళ్లిపోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం హరీశ్ రావుతో పాటు, ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలను అరెస్టు చేసిన పోలీసులు అక్కడి నుంచి తరలించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Advertisement

Next Story

Most Viewed