TGSP: తెలంగాణ పోలీసు శాఖ సంచలన నిర్ణయం.. 39 మంది సిబ్బందిపై సస్పెన్షన్ వేటు

by Shiva |   ( Updated:2024-10-27 02:02:39.0  )
TGSP: తెలంగాణ పోలీసు శాఖ సంచలన నిర్ణయం.. 39 మంది సిబ్బందిపై సస్పెన్షన్ వేటు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో వరుసగా పోలీసుల ఆందోళనలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ పోలీస్ శాఖ (Telangana Police Department) సంచలన నిర్ణయం తీసుకుంది. డిపార్ట్‌మెంట్‌లో ఆందోళనలను ప్రేరేపిస్తున్న వారిపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఈ మేరకు మొత్తం 39 మంది తెలంగాణ స్పెషల్‌ పోలీస్‌ (TGSP) సిబ్బందిపై ఆర్టికల్ 311 మేరకు సస్పెన్షన్‌ (Suspension) వేటు వేసింది. 3,4,5,17వ బెటాలియన్లలో ఆరుగురు చొప్పున, 6,12, 13వ బెటాలియన్లలో ఐదురుగు చొప్పున సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేశారు.

పోలీస్‌ ఉద్యోగంలో ఉండి ధర్నాలు, ఆందోళనలకు నాయకత్వం వహించారని.. నిరసనలను ప్రేరేపించి క్రమశిక్షణను ఉల్లంఘించారని అందుకే TGSP సిబ్బందిపై ప్రభుత్వం సస్పెన్షన్‌ వేటు వేసినట్లుగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే సస్పెన్షన్ వేటు పడిన వారు వివిధ బెటాలియన్లకు సంబంధించి హెడ్‌ కానిస్టేబుల్ (Head Conistables), కానిస్టేబుల్‌ (Conistable) హోదాల్లో పని చేస్తున్నారు. టీజీఎస్పీ బెటాలియన్ల (TGSP Battalions)లో ఆందోళనలకు నేతృత్వం వహించిన, మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చిన వారిని గుర్తించి.. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 311 (Article 311) ప్రకారం.. చర్యలు తీసుకున్నట్లుగా ఉన్నతాధికారులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed