- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
కలెక్టర్, ఉద్యోగులపై దాడి.. రాష్ట్ర వ్యాప్త ధర్నాలకు TEJAC చైర్మన్ లచ్చిరెడ్డి పిలుపు
దిశ, తెలంగాణ బ్యూరో: వికారాబాద్ జిల్లాలో అధికారులపై జరిగిన దాడిని ఉద్యోగులే కాకుండా రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా ఖండించాలని తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి కోరారు. అధికారం లేకనో.. అధికారం కోసమో.. ఉద్యోగులపై దాడికి ప్రేరేపించడం సరైన చర్య కాదన్నారు. రాష్ట్రంలోని ఉద్యోగులందరూ రాష్ట్ర ప్రజలకు, అన్ని రాజకీయ పార్టీలకు సమానమేనని అన్నారు. కానీ, అధికారులపై జరిగిన దాడిని మాత్రం ఖండించకపోగా, దాడికి పాల్పడిన వారిని పరామర్శించడం ప్రజాస్వామ్యానికే అవమానకరంగా మారే ప్రమాదం ఉందన్నారు.
ఇలాంటి ఘటనలు ఇప్పుడే కాదు, భవిష్యత్తులోనూ జరుగొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లుగా తెలిపారు. ఈ దాడి ఒకరిద్దరు అధికారులపై లేదా రెవెన్యూ శాఖాధికారులపై జరిగిన దాడిగా చూకలెక్టర్, ఉద్యోగులపై దాడి.. రాష్ట్ర వ్యాప్త ధర్నాలకు TEJAC చైర్మన్ లచ్చిరెడ్డి పిలుపుడటం లేదన్నారు. తెలంగాణలోని యావత్తు ఉద్యోగ లోకంపై జరిగిన దాడిగా భావిస్తున్నట్లుగా తెలిపారు. ఇదే అంశమై బుధవారం హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ ఉద్యోగుల జేఏసీ అత్యవసర సమావేశంలో తీసుకున్న పలు నిర్ణయాలను ప్రకటించారు.
14.11.2024న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముందు భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలు, ధర్నాలు చేపట్టాలని లచ్చిరెడ్డి పిలుపునిచ్చారు. అదే విధంగా రాష్ట్ర రాజధానిలోని హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద జరిగే నిరసన, ధర్నా కార్యక్రమం చేపట్టనున్నట్లుగా తెలిపారు. మధ్యాహ్నం 12గంటలకు జరిగే నిరసనలు, ధర్నా కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర నాయకత్వం పాల్గొనాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే నిరసన ప్రదర్శనలు, ధర్నా కార్యక్రమాల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లు , సీపీఎస్, అవుట్ సోర్సింగ్, ఉద్యోగులు, సంఘాలు, జేఏసీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని లచ్చిరెడ్డి పిలుపునిచ్చారు.