Atrocious:హైదరాబాద్‌లో దారుణం..హోంగార్డు బెదిరింపులతో వ్యక్తి ఆత్మహత్య

by Indraja |
Atrocious:హైదరాబాద్‌లో దారుణం..హోంగార్డు బెదిరింపులతో వ్యక్తి ఆత్మహత్య
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబద్ లో దారుణం చోటు చేసుకుంది. ఇరుగు పొరుగు వారి మధ్య చిన్న చిన్న గొడవలు ఉండడం సహజం. అయితే ఆ గొడవలు ఓ వ్యక్తి మరణానికి కారణమైయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబద్ లోని రామంతాపూర్‌ సత్యనగర్ కాలనీలో శ్రీనివాస్‌, నాగరాజు పక్కపక్క ఇల్లలో నివాసం ఉంటున్నారు. కాగా నాగరాజు హోంగార్డుగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు.

కాగా నిన్న శ్రీనివాస్‌ ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలను విడిచారు. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ మృతికి కారణం హోంగార్డు నాగరాజు అని.. నాగరాజు తన పిస్టల్ తో బెదిరించారని.. గత కొద్ది రోజులుగా హోంగార్డు శ్రీనివాస్ ను వేధిస్తున్నారని.. ఆ వేధింపులు తాళలేక శ్రీనివాస్ ఆత్మ హత్యకు పాల్పడినట్లు మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో నిందితుడి ఇంటి ముందు మృతుడి మృతదేహాన్ని పెట్టి ఆందోళనకు దిగారు. కాగా ఆందోళన గురించిన సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన ఘటన స్థలానికి చేరుకొని ఆందోళన చేస్తున్న మృతుడి బంధువులకు నేచ్ఛచెప్పడంతో మృతుడి బంధువు ఆందోళన విరమించుకున్నారు. కాగా మృతుడి బంధుల ఫిర్యాదు మేరకు హోంగార్డు నాగరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇక స్థానికుల సమాచారం ప్రకారం గత మూడు సంవత్సరాలుగా మృతుడు శ్రీనివాస్ కి నిందితుడు నాగరాజు కు మధ్య గొడవలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో హోంగార్డు నాగరాజు, శ్రీనివాస్ ను బెదిరించడంతో శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నారని మృతుడి బంధువుల ఆరోపణ. కాగా ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


Advertisement

Next Story