- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దారుణం.. వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడి మృతి
దిశ, వెబ్‌డెస్క్: పసిప్రాయం.. ఆడుకోవడమంటే సరదా.. తన తండ్రి బయటకు తీసుకురావడంతో సంబరపడిన ఆ నాలుగేళ్ల బాలుడిపై వీధికుక్కల రూపంలో విధి కాటేసింది. జంతువులపై దాడి చేసినట్లు వీధి కుక్కలు బాలుడిపై దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ హృదయ విదారక ఘటన హైదరాబాద్‌లోని అంబర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
డీఐ ప్రభాకర్, అడ్మిన్ ఎస్ ఐ మల్లేశం తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా ఇందల్ వాయి మండల కేంద్రానికి చెందిన గంగాధర్ నాలుగేళ్ల క్రితం నగరానికి వలస వచ్చాడు. ఛే నంబర్ చౌరస్తాలోని ఓ కారు సర్వీస్ సెంటర్‌లో వాచ్‌మెన్‌గా డ్యూటీ చేస్తున్నాడు. భార్య, ఆరేళ్ల కుమార్తె, కుమారుడు ప్రదీప్(4) లతో కలిసి బాగ్ అంబర్ పేట ఎరుకల బస్తీలో నివాసం ఉంటున్నాడు.
ఆదివారం హాలీడే కావడంతో సరదాగా పిల్లలతో కలిసి తను పనిచేసే చోటుకే వెళ్లాడు. కుమారుడు ప్రదీప్ సమీపంలో ఆడుకుంటుండగా మరో వాచ్ మెన్ తో కలిసి పనిమీద మరో ప్రాంతానికి వెళ్లాడు. కాసేపు ఆడుకున్న ప్రదీప్ అక్క కోసం నడుచుకుంటూ వస్తుండగా వీధి కుక్కలు వెంటపడ్డాయి.
బాలుడిపై విరుచుకుపడ్డాయి. అరుపులు విన్న అక్క తండ్రికి సమాచారమివ్వగా ఆయన వచ్చి అదిలించడంతో వీధి కుక్కలు బాలుడిని వదిలేశాయి. బాలుడిని హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఒక్క సారిగా ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.
- Tags
- hyderabd