Big Breaking: అరికెపూడి గాంధీపై కేసు.. ఆయన సోదరుడు, కుమారుడిపై కూడా..!

by karthikeya |
Big Breaking: అరికెపూడి గాంధీపై కేసు.. ఆయన సోదరుడు, కుమారుడిపై కూడా..!
X

దిశ, వెబ్‌డెస్క్: హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, శేర్‌లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీల వివాదం కీలక మలుపు తీసుకుంది. ఈ వివాదంలో అరికెపూడి గాంధీపై కౌశిక్ రెడ్డి ఫిర్యాదు మేరకు శేరిలింగంపల్లి పోలీసులు తాజాగా మరో కేసు నమోదు చేశారు. ఆయనో పాటు ఆయన సోదరుడు, కుమారుడిపై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మరో ఇద్దరు కార్పొరేటర్లు కార్పొరేటర్లు వెంకటేష్ గౌడ్, శ్రీకాంత్‌లపై కేసులు పెట్టినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే అరికెపూడి గాంధీ,కౌశిక్ రెడ్డిల మధ్య మూడు రోజులుగా వివాదం చెలరేగుతున్న విషయం తెలిసిందే. గురువారం నాడు అరికెపూడి గాంధీ తన అనుచరులతో కలిసి కౌశిక్ రెడ్డి ఇంటి ముందు ఆందోళనకు దిగగా.. జనాల్లో కొంతమంది కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడికి చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు అరికెపూడి గాంధీతో పాటు ౩౦ మందికి పైగా ఆయన అనుచరులను అరెస్ట్ చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే ముందుగా గచ్చిబౌలి పోలీసులు ఎస్సై ఫిర్యాదుతో సుమోటోగా కేసు నమోదు చేయగా.. తాజాగా కౌశిక్ రెడ్డి ఫిర్యాదుతో శేరిలింగంపల్లి పోలీసులు కూడా కేసు నమోదు చేశారు.

Advertisement

Next Story

Most Viewed