వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ఉద్యమనేతలపై మరోసారి విమర్శలు చేసిన బొలిశెట్టి

by karthikeya |
వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ఉద్యమనేతలపై మరోసారి విమర్శలు చేసిన బొలిశెట్టి
X

దిశ, వెబ్‌డెస్క్: విశాఖ స్టీల్‌ప్లాంట్ (vizag steel plant) ఉద్యమనేతలపై జ‌న‌సేన నాయ‌కుడు బొలిశెట్టి స‌త్యనారాయ‌ణ‌ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఉండడానికి ఏం చేయాలో అదంతా టీడీపీ (TDP), జనసేన (Janasena) కూటమి ప్రభుత్వం చేస్తోందని, పోరాటం పేరుతో ఉద్యమనేతలంతా కబుర్లు చెప్పుకుంటున్నారని ఆరోపించారు. కొద్ది రోజుల క్రితం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న వారిపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలకు ఉద్యమనేతలంతా బొలిశెట్టిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన బొలిశెట్టి మరోసారి ఉద్యమనేతలపై విరుచుకుపడ్డారు.

స్టీల్‌ప్లాంట్ పోరాడుతున్న వారికి మద్దతుగా 2021లో తమ నేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అఖిలపక్షం వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారని, ఉద్యమ నాయకులతో కలిసి తాను కేంద్రంతో పోరాడతానని అన్నారని, కానీ ఆ సమయంలో ఈ ఉద్యమ నాయకులు ఆయనకు మద్దతు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడు జగన్మోహన్‌రెడ్డి (JaganMohan Reddy) ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ఉద్యమ నాయకుల్లో ఒక్కరు కూడా సర్కార్‌ని కనీసం నిలదీయలేదని, ఆ సమయంలో ఉద్యమం చేయకుండా 1000 రోజుల తర్వాత ఇప్పుడు ఉద్యమం అంటూ మాట్లాడడంతోనే కడుపుమండి తాను ఆ వ్యాఖ్యలు చేశానని బొలిశెట్టి వివరణ ఇచ్చారు.

ఇంతకుముందు స్టీల్ ప్లాంట్ లాభాల్లో ఉండేదని, కానీ ఇప్పుడు నష్టాల్లోకి కూరుకుపోతోందని, దీని వెనుక కారణం ఏంటని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్‌లో అంత గోల్‌మాల్ జరుగుతుంటే కార్మిక నాయకులు ఏం చేస్తున్నారని నిలదీశారు. అనంతరం తాను ఇంతకుముందు చేసిన వ్యాఖ్యలకు కూడా వివరణ ఇచ్చిన బొలిశెట్టి.. నిజంగా ఉద్యమం (Movement) చేస్తున్న వారిని తాను తప్పు పట్టలేదని, లోపాయికారి ఒప్పందం చేసుకున్న వారిపైనే విమర్శలు చేశానని, సమయం వచ్చినప్పుడు వారి పేర్లు కూడా బయటపెడతానని బొలిశెట్టి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు స్టీల్‌ప్లాంట్‌తో పాటు కార్మికులు (Workers), నిర్వాసితుల ప్రయోజనాలను కాపాడడమే తనకు ముఖ్యం అని, వాళ్లకి నష్టం కలిగించేవారిని తాను ప్రశ్నిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. అయితే బొలిశెట్టి వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డ స్టీల్ ప్లాంట్ ఉద్యమ జేఏసీ నేతలు వెంటనే ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed