WhatsApp లో వీడియో కాల్ నాణ్యత మెరుగుపరుచుకోవాలా? ఈ సెట్టింగ్ చేంజ్ చేయండి

by Anjali |   ( Updated:2024-09-18 08:00:06.0  )
WhatsApp లో వీడియో కాల్ నాణ్యత మెరుగుపరుచుకోవాలా? ఈ సెట్టింగ్ చేంజ్ చేయండి
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రజెంట్ డేస్‌లో స్మార్ట్ ఫోన్టకు ఎంతలా అడక్ట్ అవుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. పిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా పొద్దస్తమానం ఫోన్లలో మునిగి తేలుతున్నారు. ఒక పూట అన్నం లేకుండా అయినా ఉంటారు కానీ మొబైల్ లేకుండా మాత్రం ఊపిరి కూడా పీల్చుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఫోన్ ఎక్కువగా చూడటం వల్ల పిల్లల మెదడుపై ప్రభావం చూపుతుందని తరచూ నిపుణులు చెబుతూనే ఉంటారు.

కానీ తల్లిదండ్రులు పిల్లలపై ప్రేమతో ఏం అడిగినా చేస్తుంటారు. కొంతమంది పేరెంట్స్ పిల్లలు ఫుడ్ తినాలని, ఏడ్వకూడదు అని మొబైల్ చేతిలో పెడతారు. కానీ సరదా కోసం ఇచ్చే మొబైల్ ఎన్నో నష్టాలు తెచ్చిపెడుతుంది. ఫోన్ వల్ల ఉపయోగాలు ఉన్నప్పటికీ నష్టాలు కూడా ఉన్నాయనే విషయాల్ని ప్రజలు గుర్తుపెట్టుకోవాలి.

అయితే స్మార్ట్ ఫోన్ నుంచి ఫ్రెండ్స్ అండ్ తల్లిదండ్రులు హాస్టల్‌లో ఉండే పిల్లలకు, బంధువులకు వీడియో కాల్స్ చేస్తుంటారు. కానీ సమ్ టైమ్స్ వీడియో కాల్ నాణ్యత చాలా తక్కువగా చూపిస్తుంది. కాగా వెంటనే మీ ఫోన్‌లో ఈ సెట్టింట్ మార్చండి.

దీంతో హెచ్‌డీ వీడియో కాల్స్ ఏం చక్కా మాట్లాడుకోవచ్చు. ముందుగా సెట్టింగ్ ఓపెన్ చేసి డేటా ఆప్షన్ ను నొక్కడి. ఆ ఫీచర్ ఆన్‌లో ఉంటే దాన్ని ఆఫ్ చేయండి. దీంతో హెచ్‌డీ వీడియో కాల్ మాట్లాడవచ్చు. అలాగే వీడియో కాల్స్ మాట్లాడేటప్పుడు క్వాలిటీ బాగుండాలంటే వైఫై లేదా సెల్యులార్ నెట్‌వర్క్‌ను ఎంచుకోండి.

Advertisement

Next Story

Most Viewed