Nani Odela 2 : సర్‌ప్రైజింగ్ న్యూస్.. ‘నాని ఓదెల 2’ అంటూ భారీ అప్‌డేట్

by sudharani |
Nani Odela 2 : సర్‌ప్రైజింగ్ న్యూస్.. ‘నాని ఓదెల 2’ అంటూ భారీ అప్‌డేట్
X

దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని ఇటీవల ‘సరిపోదా శనివారం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మొదట మిక్సిడ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ.. కలెక్షన్స్ మాత్రం భారీగానే రాబట్టి బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది. ఇదిలా ఉంటే.. ‘సరిపోదా శనివారం’ తర్వాత నాని వరుసగా మూవీస్ అనౌన్స్ చేస్తూ సందడి చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో ప్రాజెక్ట్ తెరమీదకు వచ్చింది. శ్రీకాంత్ ఓదెల, నేచురల్ స్టార్ నాని కాంబినేషన్‌లో వచ్చిన ‘దసరా’ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నాని కెరీర్‌లోనే మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం నిలిచింది అనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పుడు అదే డైరెక్టర్‌తో మరో మూవీ చెయ్యబోతున్నాడు మన నేచురల్ స్టార్. ఈ విషయంపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇస్తూ.. షూటింగ్ అప్‌డేట్ షేర్ చేసుకున్నాడు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల.

ఈ మేరకు ‘2023 మార్చి 7న ‘దసరా’కు చెప్పిన లాస్ట్ ‘‘కట్‌, షాట్ ఒకే’’. 2024 సెప్టెంబర్‌ 18న.. ‘నానిఓదెల2’ సినిమా అనౌన్స్ మెంట్‌ కోసం మళ్లీ యాక్షన్‌ చెప్తున్న. 48,470,400 సెకన్లు అయిపోయాయి.. ఇక నుంచి ప్రతీ సెకన్‌ను నా నెక్ట్స్‌ సినిమా కోసం చిత్తశుద్దితో వినియోగిస్తా. దసరా కంటే 100 రెట్లు ప్రభావం చూపించబోతుందని హామీనిస్తున్నా..’ అంటూ ఫైరింగ్ మూడ్‌లో ఉన్న ఫస్ట్ షాట్ షేర్ చేశాడు. దీంతో మరోసారి నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న మూవీపై హై ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగేలా ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. కాగా.. ఈ చిత్రానికి సంబంధించి నటీనటుల వివరాలు త్వరలో ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Read More..

Game Changer: గేమ్ ఛేంజర్ పై వరుస అప్డేట్స్ ఇచ్చిన తమన్.. ఇక నుంచి ప్రతి వారం మోత మోగిపోవడం పక్కా!

Advertisement

Next Story

Most Viewed