లవ్ జీహాదికి పాల్పడిన జానీ మాస్టర్‌పై పోలీసులు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి: ఎమ్మెల్యే రాజా సింగ్

by Mahesh |   ( Updated:2024-09-19 14:49:35.0  )
లవ్ జీహాదికి పాల్పడిన జానీ మాస్టర్‌పై పోలీసులు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి: ఎమ్మెల్యే రాజా సింగ్
X

దిశ, వెబ్ డెస్క్: జానీ మాస్టర్ (Johnny Master) తనను లైంగికంగా వేదించాడని మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. కాగా మహిళా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈ రోజు గోవాలో జానీ మాస్టర్‌(Johnny Master)ను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా ఈ వ్యవహారంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (BJP MLA Rajasingh)తీవ్రస్థాయిలో మండిపడ్డారు. లవ్ జీహాది(Love Jihadi)కి పాల్పడిన జానీ మాస్టర్‌కు పోలీసులు మంచి పనిష్మెంట్ ఇవ్వాలని.. కోరుతూ సోషల్ మీడియాలో ఓ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో రాజాసింగ్ మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీకి మరోసారి మచ్చ తీసుకొచ్చారు. అందుకే సినిమా ఇండస్ట్రీ ప్యానెల్‌కు రిక్వెస్ట్ చేస్తున్నా.. ఇకపై ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై స్ట్రిక్ట్ యాక్షన్ (Strict action) ఉండాలి. ఈ విధంగా ఎవరైనా మహిళలను కన్వర్ట్ అవ్వండని ఇబ్బంది పెడితే ఇంకోసారి ఇండస్ట్రీలో కాలు పెట్టకుండా చట్టం తీసుకురావాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (BJP MLA Raja Singh) కోరారు.

Read More..

అలాగైతే నా భర్తను వదిలేయడానికి సిద్ధం.. జానీ మాస్టర్ భార్య సంచలన ప్రకటన

Advertisement

Next Story

Most Viewed