- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దశాబ్ది ఉత్సవాల వేళ.. తెలంగాణ తల్లికి ఘోర అవమానం..!
దిశ, ఎల్బీనగర్ : బంగారు తెలంగాణలో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తున్న వేళ తెలంగాణ తల్లికి ఘోర అవమానం జరిగింది. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని బీ.ఎన్..రెడ్డి నగర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం కుడి చేయీ ధ్వంసమైనా.. స్థానిక ప్రజా ప్రతినిధులు గాని, అధికారులు కానీ పట్టించుకోకపోవడం శోచనీయం. తెలంగాణ తల్లి విగ్రహం అలంకరణకు కూడా నోచుకోకపోవడంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను 20 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తుంది. ఈ తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాలను అలంకరించి, పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పిస్తున్న వేళ ఎల్బీనగర్ నియోజకవర్గం బీ.ఎన్.రెడ్డి నగర్‌లో స్థానిక ఎమ్మెల్యే గాని, బీఆర్ఎస్ నాయకులు గానీ కనీసం పూలమాల వేసేందుకు కూడా ముందుకు రాకపోవడం పై ప్రజలు, తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్న వేళ తెలంగాణ తల్లి విగ్రహానికి మరమ్మత్తులు చేసి నివాళులర్పించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.