- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Assembly session: మరి కాసేపట్లో అసెంబ్లీ సెషన్ స్టార్ట్.. కీలక తీర్మానం ప్రవేశపెట్టనున్న CM రేవంత్
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మరి కాసేపట్లో మొదలు కానున్నాయి. అసెంబ్లీ నిర్వహణపై బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) తీసుకున్న నిర్ణయాలను సీఎం రేవంత్ సభలో వెల్లడించనున్నారు. అనంతరం 2024-2025 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణకి జరిగిన అన్యాయంపై సభలో సీఎం రేవంత్ తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. ఈ తీర్మానంపై సభ్యుల చర్చ అనంతరం ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి ప్రభుత్వం పంపనుంది. దీనితో పాటుగా సభలో ఇవాళ హైదరాబాద్ అభివృద్ధిపై స్వల్పకాలిక చర్చ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు టాక్. మరోవైపు నిరుద్యోగుల సమస్యపై ఉభయ సభల్లో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు స్పీకర్‌కు వాయిదా తీర్మానాన్ని అందించారు. జాబ్ క్యాలెండర్, నిరుద్యోగుల ఆందోళనలపై ప్రభుత్వ అణిచివేత వైఖరిపై సభలో చర్చ నిర్వహించాలని బీఆర్ఎస్ విజ్ఞప్తి చేసింది.