- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TG Assembly: తెల్లవారుజాము వరకు అసెంబ్లీ..! శ్రీధర్ బాబుకు కేటీఆర్ కీలక సూచన
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిన్న సుదీర్ఘంగా చర్చ సాగింది. నిన్న ఉదయం 10 గంటలకు సభ ప్రారంభమై.. మంగళవారం రోజు వేకువ జామున 3:15 గంటలకు వరకు సమావేశాలు కొనసాగాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మొట్ట మొదటిసారిగా దాదాపుగా 17 గంటల పాటు ఏకధాటిగా అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఒకే రోజు 19 పద్దులపై చర్చ జరిపి అప్రూవ్ చేసుకోవాలనే ఉద్దేశంతో మంగళవారం 3 గంటల వరకు అసెంబ్లీ నడిపారు. ీ క్రమంలోనే శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబుకు మాజీ మంత్రి కేటీఆర్ కీలక సూచనలు చేశారు.
సమావేశాలకు తాము సహకరిస్తామని, వచ్చే సెషన్‌ను 20 రోజుల పాటు నిర్వహించాలని ఈ సందర్భంగా సూచించారు. సుదీర్ఘ ప్రంసంగాలు చేయొద్దన్న శాసనసభ వ్యవహారాల మంత్రి ప్రతిపాదనను అంగీకరిస్తున్నామని చెప్పారు. కానీ ఈ సభలో 57 మంది కొత్త సభ్యులు ఉన్నారని, వారు మాట్లాడాలని అనుకుంటున్నారని పేర్కొన్నారు. ఇలా రోజుకు 19 పద్దులపై చర్చ పెట్టకుండా.. రోజుకు 2 లేదా 3 పద్దులపై చర్చ పెట్టాలని, మంత్రులకు కూడా సుదీర్ఘ వివరణ ఇచ్చే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా వెల్లడించారు.