Assembly: అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. పీడీఎస్‌యూ నాయకుల అరెస్ట్

by Ramesh Goud |
Assembly: అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. పీడీఎస్‌యూ నాయకుల అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: అసెంబ్లీ(Telangana Assembly) వద్ద ఉద్రిక్త వాతవరణం నెలకొంది. అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన పీడీఎస్‌యూ విద్యార్థి సంఘం నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే విద్యారంగంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్(Demand) చేస్తూ పీడీఎస్‌యూ(PDSU) రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే పీడీఎస్‌యూ విద్యార్థి సంఘం నాయకులు అసెంబ్లీ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ అసెంబ్లీ గేటు వైపు దూసుకొచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలను, విద్యార్థుల ఆత్మహత్యలను నివారించాలని, పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, బడ్జెట్ లో విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని, కార్పొరేట్ కళాశాలల ఆగడాలని అరికట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇది గమణించిన పోలీసులు వీరిని అసెంబ్లీ వైపు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో కాసేపు అసెంబ్లీ ప్రాంగణంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనంతరం పోలీసులు నిరసన కారులను అరెస్ట్(Arrest) చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Advertisement

Next Story