- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
30 లక్షల మంది నిరుద్యోగులతో ఉద్యమం చేస్తాం.. హైదరాబాద్‌ను కదలనివ్వం: అశోక్
దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డిపై అశోక్ సార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో రైతులు ఆందోళన చేసిన తరహాలో తెలంగాణలో 30 లక్షల మంది నిరుద్యోగులతో ఉద్యమం చేసి రేవంత్ రెడ్డిని సీఎం సీటు నుండి దింపుతామన్నారు. మైక్ పట్టుకుని మాట్లాడటం తప్ప ఆయనకు ఏమి రాదని, పాలన చేతకాదని, పరిపాలనకు రేవంత్ రెడ్డి పనికిరారని విమర్శించారు. రాష్ట్రానికి మరో ముఖ్యమంత్రి కావాలని.. రేపటి నుండి సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ నిరుద్యోగుల నుండి రాబోతుందన్నారు. ఢిల్లీని రైతులు మూకుమ్మడిగా ముట్టడించినట్లే హైదరాబాద్‌ను కదలనివ్వమని హెచ్చరించారు. అసలు నువ్వు విద్యాశాఖ మంత్రి ఎలా అవుతావని.. ఏం తెలుసని విద్యాశాఖను మీ దగ్గర పెట్టుకున్నారని రేవంత్ రెడ్డిని నిలదీశారు. నిరుద్యోగులు ఇకనైనా సామాజిక అవగాహన పెంచుకోవాలని.. ఎవరు ఎటుపోతే నాకేంటి అనుకుంటే ఇలాంటి పనికిమాలిన ముఖ్యమంత్రులు సీట్లలో కూర్చొంటారని అన్నారు. కాంగ్రెస్‌ను గెలిపించి తప్పు చేశామని భావన కలుగుతోందన్నారు. తెలంగాణకు ఇంత పనికిమాలిన ముఖ్యమంత్రి వస్తాడని అనుకోలేదని.. వచ్చిన ఇంత దారుణంగా పాలన చేస్తాడనుకోలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు