- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్‌తో కలుస్తాం.. ఓవైసీ కీలక ప్రకటన
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ముస్లింలతో పాటు హిందువులు, జైనుల, ఇతరుల సంక్షేమం కోసం సైతం పోరాడుతామని చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ఓవైసీ అన్నారు. శాసనసభ సమావేశాల్లో ఆయన విద్య, వైద్యం అంశాలతో పాటు పది డిమాండ్లను లేవనెత్తారు. పాఠశాలల అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన మన ఊరు-మనబడి, మన బస్తీ-మనబడిలో పొందుపరిచిన మౌలిక సదుపాయాలన్నీ గత బడ్జెట్ లో ప్రస్తావించనవే అని, ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టినవి ఏమీ లేవని ఆయన తెలిపారు. మన ఊరు-మనబడిని విడతల వారీగా కాకుండా అన్ని ఏకకాలంలో అభివృద్ధి చేపట్టాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని అన్ని ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో కనీస వసతులు కరువయ్యాయని పేర్కొన్నారు. ప్రైవేట్ స్కూళ్ల నుంచి ప్రభుత్వ స్కూళ్లలో చేరుదామనుకున్న విద్యార్థులకు ప్రైవేట్‌యాజమాన్యాలు టీసీ ఇవ్వట్లేదని, టీసీ లేకుండానే ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చుకునేలా తీసుకోవాలనే డిమాండ్‌ను అక్బరుద్దీన్ లేవనెత్తారు. ముఖ్యమంత్రి ప్రకటించిన ఖాళీల భర్తీపై అక్బరుద్దీన్ ప్రశ్నించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేస్తామని చెప్పి అందులో ఏయే శాఖకు చెందినవారున్నారో క్లారిటీ ఇవ్వలేదన్నారు. తెలంగాణలో ఉన్న రెసిడెన్షియల్ స్కూళ్లను అప్‌గ్రేడ్ చేయాలని అక్బరుద్దీన్ డిమాండ్ చేశారు. విద్యాశాఖలో 95 శాతం మంది ఎంఈవోలు ఇన్ చార్జీలేనని, అందులో కొందరు 7, 8 మండలాలు పర్యవేక్షిస్తే, కొందరు 5, ఇంకొందరు 3, 4 మండలాలను పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. డీఈవోలు కూడా ఏడుగురు మాత్రమే ఉన్నట్లుగా తెలిపారు.
ఉర్దూ మీడియం పోస్టులకు ప్రత్యేకంగా డీఎస్సీ నిర్వహించాలని అక్బరుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. పలు కోర్సుల్లో ఉర్దూ మీడియానికి సంబంధించి పోస్టులు నేటికీ భర్తీ చేయలేదని, ఖాళీలను భర్తీ చేయకుండా ఖతం పట్టిస్తున్నారని సభలో తెలిపారు. ఉర్దూ మీడియంలో 69 లెక్చరర్ పోస్టుల రెగ్యులరైజేషన్‌కు సంబంధించిన ఫైల్ ను పెండింగ్‌లో పెట్టారన్నారు. అన్ని రకాల కాంపిటేటివ్ పరీక్షలతో పాటు ఎంసెట్‌ను కూడా ఉర్దూలో కూడా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ విషయాలపై చర్చించేందుకు విద్యాశాఖ మంత్రి తమతో ప్రత్యేక మీటింగ్ ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లుగా టెట్ నిర్వహించలేదని, లక్షల మంది ఎదురుచూస్తున్నారన్నారు. ఇటీవల యూనివర్సిటీలకు నియమించినీ వీసీల్లో ముస్లింలకు ప్రాధాన్యం కల్పించకపోవడంపై ఫైరయ్యారు. ఐఐటీ బాసరకు వీసీ లేడని, అక్కడ విద్యార్థులకు భోజనం సరిగ్గా అందించట్లేదని, ఫుడ్‌లో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు తనకు ఫోన్చేస్తున్నారని ప్రస్తావించారు. తమ సమస్యలపై సభలో మాట్లాడాలని విద్యార్థులు ప్రశ్నించాలని కోరారని ఆయన వెల్లడించారు.
ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నది వక్ఫ్భూముల్లోనేనని ఎమ్మెల్యే అక్బరుద్దీన్ పేర్కొన్నారు. అయితే ముస్లింల కాలనీలకు వెళ్లే రోడ్లు, మజీద్, ఖబర్‌స్తాన్‌కు వెళ్లే దారులన్నీ మూసేశారని, వాటిని తెరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొత్తపేట మార్కెట్‌కు సంబంధించి హైకోర్టు స్టే ఇచ్చినా సర్కార్కూలగొట్టిందని, దీంతో నిరుపేదల బతుకులు రోడ్డున పడ్డాయన్నారు. రోడ్లపై అమ్ముకుందామంటే పోలీసులు చలాన్లు వేస్తున్నారన్నారు. వ్యాపారుల ఇబ్బందులు తొలగించేందుకు అవసరమైతే 30 ఎకరాల వక్ఫ్‌బోర్డు భూములిస్తామని, కొత్త మార్కెట్ఏర్పాటయ్యే వరకు వారికి అందులో టెంపరరీగా ఏర్పాట్లు చేయాలని సభలో తెలిపారు. కొవిడ్సమయంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన వైద్య సిబ్బంది కాంట్రాక్ట్పీరియడ్ఈ నెల 31తో ముగుస్తుందని, వారిని రెగ్యులరైజ్‌చేయాలని మంత్రి హరీశ్‌రావును కోరారు. దీనికి స్పందించిన హరీశ్‌రావు వైద్య సిబ్బందిని ఒక ఏడాది పాటు కాంట్రాక్ట్బేసిక్లో తీసుకున్నట్లు చెప్పారు. ఆ వైద్య సిబ్బందిని వెయిటేజీ ఆధారంగా క్రమంగా పర్మినెంట్చేస్తామని బదులిచ్చారు. పాత బస్తీకి ఒక స్పోర్స్ట్స్కూల్ఏర్పాటు చేయాలని, ఒకవేళ స్థలం లేకుంటే మహేశ్వరంలో అయినా ఏర్పాటు చేయాలని అక్బరుద్దీన్డిమాండ్చేశారు. అలాగే జీహెచ్ఎంసీ అభివృద్ధికి బడ్జెట్కేటాయించలేదని, త్వరగా మంజూరు చేయాలన్నారు. బంగారు తెలంగాణ సాధన కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు తాము కూడా కలిసి నడుస్తామని, బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతామని అక్బరుద్దీన్స్పష్టం చేశారు