అసదుద్దీన్ ‘జై పాలస్తీనా’ నినాదాలు.. మాధవీలత సంచలన డిమాండ్

by Rajesh |
అసదుద్దీన్ ‘జై పాలస్తీనా’ నినాదాలు.. మాధవీలత సంచలన డిమాండ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ మంగళవారం పార్లమెంట్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. ఇంత వరకు బాగానే ఉన్న చివర్లో ఆయన ‘జై పాలస్తీనా’ నినాదం చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. తాజాగా, అసదుద్దీన్ ‘జై పాలస్తీనా’ నినాదం ఇవ్వడంపై హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీచేసిన మాధవీలత ఘాటుగా స్పందించారు. రాజ్యాంగానికి, దేశానికి విరుద్ధంగా ‘జై పాలస్తీనా’ నినాదాలు చేయడం ఏంటని ప్రశ్నించారు.

ఏ దేశానికి వీళ్లు విశ్వాసం చూయిస్తున్నారని మాధవిలత ప్రశ్నించారు. ‘జై పాలస్తీనా’ నినాదం వెనుక ఉన్న అసలు మతలబు ఏంటని ప్రశ్నించారు. హమాస్ తీవ్ర వాదులను సంతోష పర్చడానికి అసదుద్దీన్ ఇలా మాట్లాడారా అని ప్రశ్నించారు. నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏజెన్సీలు అసదుద్దీన్ ను ప్రశ్నించాలని కోరారు. ఏ దేశంలో పుట్టిన వాడైనా మాతృభూమిని, మాతృభాషను గౌరవిస్తారని.. కానీ ఎంఐఎం నేతల ఉద్దేశం అలా లేదన్నారు. ప్రజలు ఎన్నుకున్న వాళ్లు వికృత రూపంగా మాట్లాడటం దురదృష్టకరమన్నారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు.

Advertisement

Next Story

Most Viewed