- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైద్యశాఖ అలర్ట్.. వైరస్ హైదరాబాద్ దాటకుండా పక్కా ప్లాన్..!
దిశ, తెలంగాణ బ్యూరో : విదేశాల నుంచి వచ్చే వైరస్వ్యాప్తిని ఈ సారి ఎట్టి పరిస్థితుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిదాటకుండా కట్టడి చేయాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకున్నది. జిల్లాల్లోని గ్రామాలకు అంటకుండా అడ్డుకట్ట వేయాలని ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ మేరకు ఇప్పటికే ముందస్తు చర్యలు చేపట్టింది. ఎయిర్‌ఫోర్ట్‌లో స్క్రీనింగ్‌తో పాటు టెస్టింగ్ప్రాసెస్ను షురూ చేసింది. లక్షణాలు ఉన్నోళ్లకు ఆర్టీపీసీఆర్విధానంలో టెస్టులు చేస్తున్నారు. పాజిటివ్తేలితే క్వారంటైన్తప్పనిసరి చేస్తున్నారు. నెగెటివ్తేలి ఇళ్లకు వెళ్లినోళ్లపై వారం రోజుల పాటు స్థానిక హెల్త్స్టాఫ్మానిటరింగ్ చేసే విధానాన్ని పునరావృతం చేయనున్నారు. మరోవైపు ఓవరల్‌గా వస్తున్న పేషెంట్ల నుంచి 2 శాతం శాంపిళ్లను ర్యాండమ్‌గా సేకరించి వేరియంట్లను నిర్ధారించే జీనోమ్సీక్వెన్సింగ్ టెస్టులకు పంపుతున్నారు. గడిచిన ఆరు నెలలుగా ఈ ప్రాసెస్సహజంగానే కొనసాగుతున్నప్పటికీ, ఇతర దేశాల్లో కరోనా అలజడి సృష్టిస్తున్న నేపథ్యంలో ఎయిర్‌పోర్టు హెల్త్ ఆథారిటీ మరింత ఫోకస్పెట్టింది. ఇప్పటి వరకు జీనోమ్సీక్వెన్సింగ్నిర్వహించిన శాంపిళ్లలో స్ట్రాంగ్వేరియంట్లుగా ప్రచారం పొందిన డెల్టా, దాని సబ్వేరియంట్లు ఏవీ నిర్ధారణ కాలేదని ఎయిర్‌పోర్టు హెల్త్ ఆఫీసర్లు తెలిపారు.
లక్షణాలు ఉన్నాయా...?
విదేశాల నుంచి గడిచిన పదిహేను రోజుల నుంచి ఎవరైనా వచ్చారా? దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు ఉన్నాయా? అని క్షేత్రస్థాయిలో ఆశాలు, ఏఎన్ఎంలు సర్వే చేయనున్నారు. లక్షణాలు ఉన్నోళ్లకు మందులు పంపిణీ చేయనున్నారు. తొలి విడత గ్రేటర్హైదరాబాద్జిల్లాల్లో ఎయిర్‌పోర్టు అథారిటీ ఇచ్చిన సమాచారాన్ని అనుసరించి మాత్రమే ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు ఓ వైద్యాధికారి తెలిపారు. ఈ సెలబ్రేషన్స్,ఫెస్టివల్స్ తర్వాత పరిస్థితిని బట్టి అన్ని ప్రాంతాల్లో నిర్వహించే అవకాశం ఉన్నదని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
గతంలో క్రమంగా.....
విదేశాల నుంచి వచ్చిన వ్యక్తుల నుంచి మన స్టేట్‌లోకి కరోనా ఎంట్రీ అయింది. గడిచిన మూడు వేవ్‌లలోనూ తొలుత గ్రేటర్హైదరాబాద్లోనే వైరస్వ్యాప్తి జరిగింది. ఆ తర్వాత పండుగలు, సెలబ్రేషన్స్ వంటి కార్యక్రమాలతో జిల్లాలకు ప్రజల రాకపోకలు పెరిగాయి. దీంతో జిల్లాల్లోనూ వైరస్ క్రమంగా వ్యాప్తి చెందింది. దీంతో ఈ సారి అలాంటి సిచ్వేషన్రాకుండా వైరస్వ్యాప్తి జరిగితే ఇక్కడే కట్టడి చేసేలా ప్రభుత్వం ప్రణాళికలను రూపకల్పన చేస్తోన్నది.
Also Read...