ఖైరతాబాద్ గణపతి ఏర్పాట్లు షురూ.. ఈ సారి విగ్రహం ఎత్తు ఎంతంటే? (వీడియో)

by Satheesh |   ( Updated:2023-12-13 15:54:01.0  )
ఖైరతాబాద్ గణపతి ఏర్పాట్లు షురూ.. ఈ సారి విగ్రహం ఎత్తు ఎంతంటే? (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఈ ఏడాది సెప్టెంబర్ 19వ తేదీన వినాయక చవితి పండుగ వస్తున్న సందర్భంగా బుధవారం ఖైరతాబాద్ గణేశుడి విగ్రహ నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. నిర్జల ఏకాదశి పురస్కరించుకుని ఖైరతాబాద్ మహాగణపతి ఏర్పాటు కోసం కర్రపూజను సాయంత్రం 5 గంటలకు నిర్వహించారు. ఈ పూజతో గణనాథుడి విగ్రహ నిర్మాణ పని ప్రారంభమైంది. ఈ ఏడాది(69 యేటా) 51 అడుగుల ఎత్తైన మట్టి గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. అలాగే వచ్చేవారం వినాయకుడికి సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేయనున్నట్లు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ తెలిపింది.

Advertisement

Next Story