House Arrest: ఎమ్మెల్యే అరెకపూడి ఇంటి ముట్టడికి ప్లాన్.. బీఆర్ఎస్ నాయకుల హౌస్ అరెస్ట్

by Shiva |
House Arrest: ఎమ్మెల్యే అరెకపూడి ఇంటి ముట్టడికి ప్లాన్.. బీఆర్ఎస్ నాయకుల హౌస్ అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, అరెకపూడి గాంధీ మధ్య పంచాయితీ తారా స్థాయికి చేరింది. గురువారం రాత్రి సీపీ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టిన బీఆర్ఎస్ కీలక నేతలు హరీశ్‌రావు, ఇతర నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఆగ్రహంతో ఆ పార్టీ కేడర్ ఊగిపోయింది. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలంటూ బీఆర్ఎస్ నాయకులు అర్ధరాత్రి వరకు నిరసనలు కొనసాగించారు. దీంతో హరీశ్‌రావుతో పాటు ఇతర నాయకులను పోలీసులు మూడు పోలీస్‌స్టేషన్లకు తరలించి అర్ధరాత్రి కేశంపేట పీఎస్ వద్ద వారిని వదిలిపెట్టారు.

అయితే, శుక్రవారం బీఆర్ఎస్ శ్రేణులు ఎమ్మెల్యే అరెకపూడి ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం ఆయన ఇంటి ఎదుట భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. అయితే, మేడ్చల్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి అరెకపూడి గాంధీ ఇంటికి వెళ్లేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలో తెల్లవారుజాము నుంచే హైదరాబాద్ పరిధిలోని నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఇప్పటికే మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు శంభీపూర్ రాజును హౌస్ అరెస్ట్ చేశారు. అదేవిధంగా మేడ్చల్ బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం ఎదుట భద్రతను కట్టుదిట్టం చేశారు. అదేవిధంగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే ఇంటి ఎదుట కూడా భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.

Advertisement

Next Story

Most Viewed