హైడ్రా చర్యలు పేద, మధ్యతరగతి వారిపైనేనా : కేటీఆర్

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-10-23 05:52:45.0  )
హైడ్రా చర్యలు పేద, మధ్యతరగతి వారిపైనేనా : కేటీఆర్
X

దిశ, వెబ్ డెస్క్ : హైడ్రా(hydra) చర్యలు పేద, మధ్యతరగతి వారి నిర్మాణలపైనేనా అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) 'ఎక్స్' వేదికగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. హైడ్రా తీసుకునే చర్యలు పేదలు, మధ్య తరగతికే వర్తిస్తాయా అని ప్రశ్నించారు. ఎఫ్ టీఎల్, బఫర్ జోన్, హెచ్ఎఫ్ఎల్ నిబంధనలు, భయపెట్టే వ్యూహాలు కేవలం పేదలు, మధ్యతరగతికేనా అని నిలదీశారు. వీటి విషయంలో ధనవంతులు, పెద్దవాళ్లకు మినహాయింపు ఉంటుందేమో అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

ఎంపిక చేసిన న్యాయాన్ని పేద, మధ్యతరగతి ప్రజల పట్ల మాత్రమే అమలు చేస్తున్నారని ఆరోపించారు. ఇందుకు నిదర్శనంగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పోస్టు చేసిన నార్సింగి ప్రాంతంలో ఆదిత్య బిల్డర్స్ సంస్థ మూసీ నదిలో చేపడుతున్న నిర్మాణాల వీడియోను కేటీఆర్ తన ట్వీట్ కు జోడించారు.

Advertisement

Next Story

Most Viewed