యథేచ్ఛగా క్రికెట్ ​బెట్టింగ్‌ నిర్వహణ.. ముగ్గురు యువకుల అరెస్ట్

by Shiva |   ( Updated:2024-03-20 14:17:51.0  )
యథేచ్ఛగా క్రికెట్ ​బెట్టింగ్‌ నిర్వహణ.. ముగ్గురు యువకుల అరెస్ట్
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: తేలికగా డబ్బు సంపాదించే లక్ష్యంతో క్రికెట్​ బెట్టింగ్​ నిర్వహిస్తున్న ముగ్గురిని సెంట్రల్ ​జోన్​ టాస్క్‌ఫోర్స్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. నిందితుల నుంచి 1.50 లక్షల నగదుతో పాటు రెండు ల్యాప్‌టాప్‌లు, 5 మొబైల్​ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్​డీసీపీ రష్మీ పెరుమాల్ ​కథనం మేరకు.. దిల్‌సుఖ్​నగర్ ​ప్రాంతానికి చెందిన ఉదయ్‌సింహా రెడ్డి, మహ్మద్​ ఫహీముద్దీన్, భానుప్రసాద్ స్నేహితులు. చేస్తున్న పనుల నుంచి ఆశించిన ఆదాయం రాకపోతుండటంతో ముగ్గురు కలిసి క్రికెట్ ​బెట్టింగ్​ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో రెండు వెబ్‌సైట్ల నుంచి బెట్టింగ్​ యాప్​ ఐడీ, పాస్​వర్డులను సేకరించారు. వీటిని ల్యాప్‌టాప్‌లో అప్‌లోడ్​ చేసి క్రికెట్ ​బెట్టింగ్​నిర్వహించటం మొదలు పెట్టారు.

లెజెండ్స్ క్రికెట్​ ట్రోఫీలో భాగంగా న్యూయార్క్​ సూపర్​స్టార్స్, రాజస్థాన్​ కింగ్స్​ జట్ల మధ్య పల్లెకిలె అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఫైనల్ ​మ్యాచ్​కు సంబంధించి సుల్తాన్​బజార్ ​స్టేషన్​ పరిధిలోని స్వీకార్​హోటల్ ​వద్ద ముగ్గురు కలిసి బెట్టింగులు స్వీకరిస్తుండగా సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్​సీఐ ఎన్.రామకృష్ణ ఎస్సై నవీన్​కుమార్‌తో పాటు సిబ్బందితో కలిసి దాడి చేసి అరెస్ట్​చే శారు. విచారణలో నిందితులు గూగుల్​పే, ఫోన్‌పే యాప్‌ల ద్వారా లావాదేవీలు జరుపుతున్నట్లుగా వెల్లడైంది. కొన్నిసార్లు భానుప్రసాద్​ నేరుగా బెట్టింగులు కట్టిన వారి వద్దకు వెళ్లి నగదును తీసుకు వచ్చేవాడని తేలింది. ముగ్గురు నిందితులపై కేసులు నమోదు చేసిన టాస్క్‌ఫోర్స్ ​పోలీసులు తదుపరి దర్యాప్తు నిమిత్తం వారిని సుల్తాన్ బజార్​ పోలీసులకు అప్పగించారు.

Advertisement

Next Story

Most Viewed