- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
హైదరాబాద్‌లో తనిఖీ పేరిట దోపిడీ.. ఏఆర్ కానిస్టేబుల్ అరెస్ట్
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: తనిఖీల పేరుతో వ్యాపారి నుంచి రూ.18.50 లక్షలు దోచుకుని ఉడాయించిన ఉదంతంలో ఆర్మ్ డ్ రిజర్వ్డ్ కానిస్టేబుల్‌ను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తూ రాచకొండ కమిషనర్ డీ.ఎస్.చౌహాన్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. బేగంబజార్ ప్రాంత నివాసి, ప్రైవేట్ ఉద్యోగి అయిన ప్రదీప్శర్మకు 20లక్షల రూపాయలు ఇచ్చిన మెహదీపట్నంలోని చిమన్లాల్ సురేష్‌కుమార్ టెక్స్టైల్స్ ఉద్యోగి అక్షయ్.. ఆ మొత్తాన్ని పంజగుట్టలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో జమ చేయాలని చెప్పాడు. ఈ క్రమంలో శుక్రవారం ప్రదీప్‌శర్మ డ్రైవర్ శంకర్‌తో కలిసి కారులో బ్యాంకుకు వెళుతుండగా.. పోలీస్ యూనిఫాంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి బంజారాహిల్స్ తాజ్‌మహల్ హోటల్ సమీపంలో కారును అడ్డగించారు. అనంతరం తనిఖీల పేరుతో ఇరవై లక్షల రూపాయల నగదుతో ఉన్న బ్యాగును తీసుకున్నారు. ఆ తరువాత ప్రదీప్ శర్మ వచ్చిన కారులోనే ఖైరతాబాద్ మెట్రోస్టేషన్‌కు వచ్చి నగదుతో ఉన్న బ్యాగును తిరిగిచ్చేసి అక్కడి నుంచి ఉడాయించారు.
ఆ తరువాత చూసుకోగా బ్యాగులో కేవలం లక్షా యాభై వేల రూపాయల నగదు మాత్రమే కనిపించింది. ఈ మేరకు ప్రదీప్‌శర్మ ఫిర్యాదు చేయగా.. పంజాగుట్ట పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. దర్యాప్తులో 2018వ సంవత్సరం బ్యాచ్‌కు చెందిన ఏఆర్‌కానిస్టేబుల్ బళ్లారి శ్రీకాంత్ ఈ నేరానికి పాల్పడినట్టుగా నిర్ధారణ అయ్యింది. ఈ క్రమంలో శ్రీకాంత్‌ను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తూ శనివారం రాచకొండ కమిషనర్డీ.ఎస్.చౌహాన్ ఉత్తర్వులు జారీ చేశారు. విధి నిర్వహణలో అవకతవకలకు పాల్పడ్డటంతో పాటు అలసత్వాన్ని ప్రదర్శించినా ఉపేక్షించేది లేదని కమిషనర్ సిబ్బందిని హెచ్చరించారు.