- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Auto Driver: శభాష్ డ్రైవరన్న.. అధికారులు చేయని పనిని చేసి చూపించారు
దిశ, డైనమిక్ బ్యూరో: ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అని ఓ మహా కవి చెప్పిన మాటలు మనసున పెట్టుకున్నాడో ఏమో కానీ ఓ ఆటో డ్రైవరన్న చేసిన పనికి అంతా ఫిదా అవుతున్నారు. పాలకులు, అధికారులు చేయలేని పనిని మీరు చేశారంటూ అభినందిస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. కామారెడ్డి పట్టణం అశోక్ నగర్ కాలనీ నుంచి కలెక్టరేట్ కార్యాలయానికి వెళ్లే రూట్లో రైల్వే గేట్ వద్ద రోడ్డు డ్యామేజ్ అయింది. దీంతో ఈ రోడ్డుపై ప్రయాణించాలంటే వాహనదారుల వెన్నులో వణుకుపుడుతోంది. ఈ సమస్యను ఇటు అధికారులు, అటు పాలకులు పట్టించుకోవడం లేదు. దీంతో వారిని నమ్ముకుంటే పని కాదనుకున్న ఓ ఆటో డ్రైవర్ తానే ఏదైనవా చేయాలని భావించాడు. వెంటనే తన ఆటోలో ఇటుకలు, మట్టిని తీసుకువచ్చి గుంతలు పూడ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన వారంతా శభాష్ డ్రైవరన్న అంటూ అభినందిస్తున్నారు.