- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
TGPSC Chairman : నియామకాలు వేగంగా, పారదర్శకంగా చేపడతాం : టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం
దిశ, వెబ్ డెస్క్ : టీజీపీఎస్సీ(TGPSC) నూతన ఛైర్మన్ గా బుర్రా వెంకటేశం(Burra Venkatesham) నేడు పదవీ బాధ్యతలు చేపట్టారు. నాంపల్లిలోని కమిషన్ ఆఫీసులో బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇకపై నియామకాల ప్రక్రియను పారదర్శకంగా, వేగంగా చేపడతామని పేర్కొన్నారు. నిరుద్యోగ అభ్యర్థుల్లో టీజీపీఎస్సీ పట్ల తిరగి విశ్వాసాన్ని నింపుతామని తెలిపిన బుర్రా వెంకటేశం, తమపై పూర్తి నమ్మకంతో పరీక్షలకు హాజరు కావాలని అభ్యర్థులను కోరారు. ఐఏఎస్ కావాలనే తన కలను కష్టపడి నెరవేర్చుకున్నానని, తన స్వంత రాష్ట్రంలో నిరుద్యోగ అభ్యర్థుల కలలు నెరవేర్చడానికి మూడున్నరేళ్ల సర్వీస్ వదులుకున్నానని తెలియ జేశారు. కాగా కమిషన్ ఛైర్మన్ మహేందర్ రెడ్డి పదవీకాలం ఇటీవలే ముగియడంతో, రాష్ట్ర ప్రభుత్వం బుర్రా వెంకటేశంను గవర్నర్ కు సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నేడు ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు.