ఇన్‌చార్జి డీజీపీ నియామకం.. కేసీఆర్‌పై విమర్శలు!

by GSrikanth |   ( Updated:2022-12-29 13:22:32.0  )
ఇన్‌చార్జి డీజీపీ నియామకం.. కేసీఆర్‌పై విమర్శలు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ తదుపరి డీజీపీ ఎవరూ అనేదానిపై క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుత డీజీపీ మహేందర్ రెడ్డి డిసెంబర్ 31తో పదవీ విరమణ చేస్తుండటంతో రాష్ట్ర ఇన్‌చార్జి డీజీపీగా 1990 బ్యాచ్‌కు చెందిన అంజనీ కుమార్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ నిర్ణయంతో మరోసారి ప్రతిపక్షాలకు సీఎం కేసీఆర్ టార్గెట్‌గా మారబోతున్నట్లుగా చర్చ జరుగుతోంది. రాష్ట్రంలోని ముఖ్యమైన పదవులు అన్ని సీఎం కేసీఆర్.. బిహార్ రాష్ట్రానికే చెందిన ఐఏఎస్, ఐపీఎస్‌లకే కట్టబెడుతున్నాడనే విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, అర్వింద్ కుమార్, సందీప్ కుమార్ సుల్తానియా, రజత్ కుమార్, అధర్ సిన్హా, వికాస్ రాజ్ వీళ్లంతా బిహార్‌కు చెందిన ఐఏఎస్, ఐపీఎస్‌లు కాగా వీళ్ల కింద ముఖ్యమైన శాఖలు ఉన్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చాలా కాలంగా విమర్శలు గుప్పిస్తున్నాడు.

కీలకమైన పనులన్నీ వీరి చేతులమీదుగానే జరుగుతున్నాయని, ప్రభుత్వంలోని కీలక పదవులకు తెలుగు వ్యక్తులు పనికి రారా అంటూ సీఎంను కార్నర్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఇన్‌చార్జి డీజీపీగా బిహార్‌కు చెందిన అంజనీకుమార్ యాదవ్‌కు బాధ్యతలు అప్పగించడంతో కేసీఆర్ నిర్ణయంపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్రాన్ని బిహార్ తెలంగాణగా మారుస్తున్నారని, అధికారంలో ఉన్న బీఆర్ ఎస్ పార్టీ కాస్త బిహార్ రాష్ట్ర సమితిగా మారిందంటూ నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐపీఎస్ ప్రవీణ్ కుమారు, ఐఏఎస్ ఆకునూరి మురళి వంటి అధికారులకు ప్రాధాన్యత దక్కకుండా చేసి, బిహార్ రాష్ట్రానికి చెందిన వారికే కీలక పదవులు కట్టబెడుతున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. మరి ఈ విషయంలో అధికార పార్టీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి మరి.

Also Read...

ఫాంహౌజ్ కేసుపై BL సంతోష్ రియాక్షన్ ఇదే

Advertisement

Next Story

Most Viewed