Rohith Sharma : రోహిత్ ఆస్ట్రేలియా టూర్ డేట్ ఫిక్స్

by Sathputhe Rajesh |
Rohith Sharma : రోహిత్ ఆస్ట్రేలియా టూర్ డేట్ ఫిక్స్
X

దిశ, స్పోర్ట్స్ : రోహిత్ శర్మ ఆస్ట్రేలియా పర్యటన డేట్ ఫిక్స్ అయింది. ఈ నెల 24న రోహిత్ పెర్త్‌ వెళ్లనున్నట్లు తెలిసింది. తొలి టెస్ట్ మూడో రోజు వరకు హిట్ మ్యాన్ భారత జట్టుతో కలవనున్నాడు. రోహిత్ జట్టుతో కలిస్తే యువ ఆటగాళ్లకు కీలక సూచనలు చేసే చాన్స్ ఉండనుంది. తాత్కాలిక కెప్టెన్ బుమ్రాకు సైతం రోహిత్ రాకతో బలం చేకూరనుంది. రోహిత్ భార్య ఇటీవల మగబిడ్డకు జన్మనివ్వగా.. తొలి టెస్ట్‌‌లో భారత కెప్టెన్ ఆడటం లేదు. డిసెంబర్ 6నుంచి ఆడిలైడ్‌లో ప్రారంభమయ్యే రెండో టెస్టులో రోహిత్ ఆడనున్నాడు. బొటనవేలుకు గాయం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న శుభ్‌మన్ గిల్ సైతం త్వరలోనే జట్టుతో కలవనున్నట్లు సమాచారం. ఈ ఇద్దరు ఆటగాళ్లు భారత జట్టుతో కలిస్తే జట్టులో మరింత కాన్ఫిడెన్స్ రానుంది. రోహిత్ గైర్హాజరుతో ఫస్ట్ టెస్ట్ సారథ్య బాధ్యతలు బుమ్రాకు అప్పగించిన విషయం తెలిసిందే. రంజీల్లో మంచి ప్రదర్శన ఇచ్చిన షమి సైతం జట్టుతో కలిసే అవకాశం ఉన్నట్లు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో బుమ్రా క్లారిటీ ఇచ్చాడు.

Advertisement

Next Story