- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ రాష్ట్ర పోలీసు అకాడమీలో కానిస్టేబుళ్లకు పీవోపీ
దిశ, గండిపేట్: తెలంగాణలో స్టైపెండరీ ట్రైనీ కానిస్టేబుళ్ల తొమ్మిది నెలల శిక్షణ పూర్తి అయ్యింది. దీంతో తెలంగాణ రాష్ట్ర పోలీసు అకాడమీలో కానిస్టేబుళ్లకు 4 వ పాసింగ్ ఔట్ పరేడ్ ను గురువారం నిర్వహించారు. ఏఆర్, సివిల్, ఎస్ ఏఆర్ సీపీఎల్, ఐటీ, సీ అండ్ పీటీవో విభాగాలకు చెందిన 8,047 మంది స్టైపెండరీ ట్రైనీ కానిస్టేబుళ్ల శిక్షణ విజయవంతమైనట్లు పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఫిబ్రవరి 21, 2024లో స్టైపెండరీ ట్రైనీ కానిస్టేబుల్స్ శిక్షణ మొదలైంది. తెలంగాణలో 19 ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో వీరు శిక్షణ తీసుకున్నారు. మొత్తం కానిస్టేబుల్ శిక్షణ పొందిన వారిలో 5709 పురుషులు, 2338 మహిళ అభ్యర్థులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ట్రైనీ కానిస్టేబుల్స్‌కు సమగ్రంగా అన్ని అంశాలపై శిక్షణ ఇచ్చారు. సివిల్, క్రిమినల్, సైబర్ కేసులు, ఎన్డీపీఎస్ యాక్ట్, క్రైమ్, సెల్ఫ్ డిఫెన్స్ ఇలా చాలా అంశాలపై శిక్షణ ఇచ్చారు.
శిక్షణ పొందిన వారిలో గ్రాడ్యుయేషన్ 5470, పోస్ట్ గ్రాడ్యుయేషన్ 1361 కానిస్టేబుల్స్ చదివారు. ఇందులో టెక్నికల్ 1755, నాన్ టెక్నికల్ 5505, లా పూర్తి చేసుకున్న వారు 15 మంది ఉన్నారు. నేడు పాసింగ్ ఔట్ పరేడ్ తర్వాత తెలంగాణ పౌరుల సేవలో 8,047 మంది కానిస్టేబుల్స్ ఉన్నారు. కాగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డీజీపీ జితేందర్, పోలీస్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. అనంతరం డీజీపీ జితేందర్ మాట్లాడుతూ.. సమాజ శ్రేయస్సులో పోలీసు కీలకంగా ఉంటాడని తెలిపారు. పోలీసులు తమకు వచ్చిన ఒత్తిడిని తట్టుకొని సమాజంలో అసాంఘిక శక్తులపై పోరాడాలని అన్నారు. గతంతో పోలీస్తే రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఎంతో పటిష్టమైందన్నారు. ప్రతి ఒక్క పోలీసు సమాజం పట్ల బాధ్యతతో పని చేయాలని, అప్పుడే పోలీసు వృత్తికి న్యాయం చేసిన వారమవుతామని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారంలో తాము ముందుంటామనే సంకేతాన్ని ఇస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోలీస్ ఉన్నత అధికారులు తదితరులు పాల్గొన్నారు.