ఓయూలో దూర విద్య కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

by Shiva |   ( Updated:2024-01-21 16:53:02.0  )
ఓయూలో దూర విద్య కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
X

దిశ, వెబ్‌డెస్క్ : ఓయూ దూర విద్య కోర్సుల్లో సెకెండ్ ఫేజ్ ప్రవేశాలకు ప్రకటన వెలువడిందని ప్రో.జీబీ రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. వివిధ డిగ్రీ కోర్సులతో పాటు పీజీ, పీజీ డిప్లొమా కోర్సుల్లో 2023-24 విద్యా సంవత్సరానికి మార్చి 31 వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు వర్సిటీ వెబ్సైట్ http://www. oucde.net/notifications.php సందర్శించాలని సూచించారు.

పీజీ కోర్సులు : ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ (ఇంగ్లీష్‌, హిందీ, తెలుగు, సంస్కృతం, ఉర్దూ, ఫిలాసఫీ, సోషియాలజీ, పబ్లిక్‌ పర్సనల్‌ మేనేజ్‌మెంట్‌, ఎకనామిక్స్‌, పొలిటికల్‌ సైన్స్‌, హిస్టరీ, సైకాలజీ), ఎంకామ్‌, ఎమ్మెస్సీ (మ్యాథమెటిక్స్‌, స్టాటిస్టిక్స్‌).

డిగ్రీ కోర్సులు : బీఏ, బీకాం జనరల్‌, బీబీఏ, బీఏ (మ్యాథ్స్‌ & స్టాటిస్టిక్స్‌)

పీజీ డిప్లొమా కోర్సులు (సంవత్సరం కోర్సు) : మ్యాథమెటిక్స్‌, ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ టీచింగ్‌, బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌, బయోఇన్ఫర్మాటిక్స్‌, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌

Advertisement

Next Story