Inter Admission: 4 రోజులు సెలవులు.. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ గడువు పెంచుతారా?

by Prasad Jukanti |
Inter Admission:  4 రోజులు సెలవులు.. ఇంటర్  ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ గడువు  పెంచుతారా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు గడువు పెంచాలనే విజ్ఞప్తులు వినిపిస్తున్నాయి. అడ్మిషన్ల కోసం ఇంటర్ బోర్డు ఇచ్చిన గడువు నిన్నటితో ముగిసిపోయింది. అయితే ఈ నెల 14న రెండవ శనివారం, 15న ఆదివారం, 16న మీలాద్ ఉన్ నబీ ఫెస్టివల్, 17న గణేశ్ నిమజ్జనోత్సవాలు ఉన్నాయి. వరుసగా నాలుగు రోజుల సెలవుల కారణంగా ప్రవేశాలకు గడువు పెంచాలనే విజ్ఞప్తులు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వినిపిస్తున్నాయి. అంతా పండగ వాతావరణం కారణంగా ప్రవేశాలకు మరికొంత సమయం ఇస్తే మరికొన్ని చేరికలు జరిగే అవకాశం ఉందని అధికారులు సైతం అభిప్రాయపడుతున్నారు. నిజానికి రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో సెప్టెంబర్ 15వ తేదీ వరకు ఇంటర్ ఫస్టియర్ లో ప్రవేశాలకు బోర్డు గడువును పొడిగిచింది. అడ్మిషన్లు పొందేందుకు ఇదే చివరి అవకాశం అని కూడా స్పష్టం చేసింది. వరుస సెలవుల నేపథ్యంలో ఇంటర్మీడియట్ బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తిగా మారింది.

Advertisement

Next Story

Most Viewed