Minister Komati Reddy : మంత్రి కోమటిరెడ్డిని కలిసిన ఏపీ కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-10-26 09:21:47.0  )
Minister Komati Reddy : మంత్రి కోమటిరెడ్డిని కలిసిన ఏపీ కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్(Minister Vasamshetty Subhash) శనివారం బంజారాహిల్స్ లోని మంత్రుల నివాస సముదాయంలో తెలంగాణ రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komati Reddy)ని మర్యాదపూర్వకంగా కలిశారు. వారి భేటీలో తెలుగు రాష్ట్రాల తాజా రాజకీయ పరిస్థితులతో పాటు. రెండు రాష్ట్రాల్లో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల తీరుతెన్నులపై చర్చించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఆర్ఆర్ఆర్, మూసీ శుద్ధీకరణ, జాతీయ రహదారుల విస్తరణ అంశాలను వాసంశెట్టి సుభాష్ కు వివరించారు.

ఈ సందర్భంగా వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ తో అనుసంధానించే ఎన్.హెచ్-65 విషయంలో కోమటి రెడ్డి చూపిన చొరవ వల్ల ఆంధ్రా తెలంగాణ మధ్య రవాణా పరిస్థితులు మరింత మెరుగుపడతాయని ఆకాక్షించారు.

Read More : మీ చొరవ వల్ల ఆంధ్ర,తెలంగాణ మధ్య రవాణా పరిస్థితులు మరింత మెరుగుపడ్డాయి

Advertisement

Next Story

Most Viewed