- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
YS వివేకా మర్డర్ కేసు.. AP కాంగ్రెస్ చీఫ్ షర్మిలకు భారీ ఊరట
దిశ, వెబ్‌డెస్క్: ఆంధప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలకు సుప్రీంకోర్టులో భారీ ఊరట దక్కింది. ఎన్నికల ప్రచారంలో వైఎస్ వివేకా హత్య కేసు గురించి ప్రస్తావించినందుకు నమోదైన కోర్టు ధిక్కరణ కేసులపై సుప్రీంకోర్టు తాజాగా స్టే విధించింది. షర్మిలతో పాటు ఇతరులపైన నమోదైన కేసులపైన దేశ అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. కాగా, ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య కేసుపై వైఎస్ షర్మిల, సునీత వైసీపీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆ పార్టీకి చెందిన ఓ నేత కడప జిల్లా కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కడప కోర్టు.. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ వివేకా హత్య కేసు గురించి మాట్లాడొద్దంటూ షర్మిల, సునీత తదితరులకు ఆదేశాలు జారీ చేసింది.
అయినప్పటికీ షర్మిల క్యాంపెయినింగ్‌లో వివేకా హత్య కేసు ప్రస్తావించడంతో ఆమెపై కోర్టు ధిక్కరణ కేసులు నమోదు అయ్యాయి. ఈ క్రమంలో షర్మిల సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనపై విధించిన కేసులపై స్టే ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. షర్మిలపై నమోదైన కోర్టు ధిక్కరణ కేసులపై స్టే విధించింది. దీంతో పాటు వివేకా హత్య కేసు గురించి ప్రస్తావించ వద్దు అంటూ కడప జిల్లా కోర్టు జారీ చేసిన ఆదేశాలపైన సుప్రీంకోర్టు స్టే విధించింది. కడప కోర్టు ఉత్తర్వులు భావ ప్రకటన స్వేచ్ఛకు విరుద్ధంగా ఉన్నాయని సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది.