ఆంధ్రప్రదేశ్‌కు ఏపీ భవన్.. తెలంగాణకు ఆ హౌస్..!

by Rajesh |   ( Updated:2023-05-05 10:18:39.0  )
ఆంధ్రప్రదేశ్‌కు ఏపీ భవన్.. తెలంగాణకు ఆ హౌస్..!
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన కొలిక్కి వచ్చింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ కీలక ప్రతిపాదనలు చేసింది. ఏపీ భవన్ ను ఆంధ్రప్రదేశ్‌కు, 7.64 ఎకరాల పటౌడీ హౌస్ ను తెలంగాణ తీసుకోవాలని ప్రతిపాదించింది. మిగిలిన 12.09 ఎకరాల ఖాళీ భూమి ఏపీ తీసుకోవాలని ప్రతిపాదించింది. ఆస్తులను 58 :42 నిష్పత్తిలో ఏపీ, తెలంగాణ పంచుకోవాలని కేంద్రం సూచించింది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఏపీ భవన్ దక్కించుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేసింది. ఏపీ భవన్ తమకు వదిలేస్తే దానిక బదులగా పటౌడీ హౌస్ లోని స్థలాన్ని తీసుకుని అక్కడ కొత్త భవనాన్ని నిర్మించుకోవాలని ఏపీ అధికారులను కోరింది. నిజాం నిర్మించిన హైదరాబాద్ హౌస్ కు ఆనుకొని ఉన్న స్థలంతో తమకు ప్రత్యేక అనుబంధముందని తెలంగాణ తెలిపింది. అయితే ఇందుకు జగన్ సర్కార్ సుముఖత చూపలేదు. అయితే ఈ నిర్ణయంపై ఏపీ సానుకూలంగా స్పందించగా తెలంగాణ నుంచి స్పందన రావాల్సి ఉంది.

Also Read...

ఓ మతం కోసం చట్టాలు మారిస్తే ఏపీ ప్రభుత్వానికి శంకరగిరి మాన్యాలే : బీజేపీ

Advertisement

Next Story