- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో విస్తుపోయే విషయం.. భుజంగరావు స్టేట్ మెంట్లో సంచలన అంశాలు
దిశ, డైనమిక్ బ్యూరో:ఫోన్ ట్యాపింగ్ కేసు మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు వాంగ్మూలంలో విస్తుపోయే అంశాలు వెలుగు చూశాయి. బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పని చేసే వారి ఫోన్లను ట్యాప్ చేసినట్లు భుజంగరావు అంగీకరించారు. ఎలాగైనా సరే మూడోసారి బీఆర్ఎస్ ను అధికారంలోకి తెచ్చేందుకు ప్లాన్ చేశామని, ప్రణీత్ రావు సహకారంతో ట్యాపింగ్ చేసినట్లు భుజంగరావు కన్ఫెక్షన్ రిపోర్ట్ లో అధికారులు పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఆర్థిక సాయం అందించే వారి ఫోన్లు, ప్రతిపక్ష నేతలు, విద్యార్థి నాయకులు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేశామని, ప్రతిపక్ష నేతల కుటుంబ సభ్యుల ఫోన్లు, వాహనాలను ట్రాక్ చేసినట్లు తెలిపారు. కామారెడ్డి ఎన్నికల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, కామారెడ్డి బీజేపీ అభ్యర్థి వెంకటరమణ రెడ్డి, రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డిపై ప్రత్యేక నిఘా ఉంచామని హైకోర్టు జడ్జితో పాటు అడ్వకేట్ల ఫోన్లను ట్యాప్ చేశామని, టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ లో కేటీఆర్ పై విమర్శలు చేసిన ప్రతిఒక్కరి ఫోన్లను ట్యాప్ చేసినట్లు పేర్కొన్నారు.
రెండు ప్రైవేటు ఆసుపత్రుల నుంచి డబ్బుల తరలింపు:
జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు మూడు ఉప ఎన్నికల సమయంలో ట్యాపింగ్ చేసినట్లు, ట్యాపింగ్ చేసి ఎస్ఓటీ, టాస్క్ ఫోర్స్ సహకారంతో ముందుకు వెళ్లామని అంగీకరించినట్లు స్టేట్ మెంట్ లో పోలీసులు పేర్కొన్నారు. రాజకీయ సమాచారాన్ని ప్రభాకర్ రావు, శ్రవణ్ కుమార్ తో పాటు మరో ప్రైవేటు వ్యక్తి ద్వారా తెలుసున్నామని, మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ సపోర్టర్స్ ఫోన్లను ట్యాప్ చేసినట్లు తెలిపారు. మాదాపూర్ ఎస్ఓటీ నారాయణ సపోర్ట్ తో ఆపరేషన్ చేసినట్లు పేర్కొన్నారు. అక్టోబర్ లో ఎన్నికల సంఘం రాధాకిషన్ రావుతో పాటు పలువురిని బదిలీ చేసిందని తెలిపరు. కంపెనీలు, వీఐపీలు, వ్యాపార వేత్తల పలు వివాదాలను బీఆర్ఎస్ నేతల సూచనలతో సెటిల్ చేశామని, సివిల్ తగాదాలను సెటిల్ చేసినట్లు పేర్కొన్నారు. రెండు ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి డబ్బులను పెద్ద ఎత్తున తరలించామని, ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నేతల ఆదేశాల ప్రకారం టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బులు తీసుకువెళ్లినట్లు, రియల్టర్ సంధ్యా శ్రీధర్ రావును రూ.13 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ కొనేలా చేశామని తెలిపారు. ఆయన తమ మాట వినకపోతే క్రిమినల్ కేసులతో చిత్రహింసలు పెట్టామని భుజంగరావు అంగీకరించినట్లు స్టేట్ మెంట్ లో అధికారులు పేర్కొన్నారు.