- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీ- కాంగ్రెస్ మరో సంచలన నిర్ణయం.. వాళ్లందరిని కాళేశ్వరం తీసుకెళ్లేలా బిగ్ ప్లాన్..!
దిశ, డైనమిక్ బ్యూరో: కాళేశ్వరం ఎత్తిపోతల్లో భాగమైన లక్ష్మి (మేడిగడ్డ) బ్యారేజీ కుంగిన ఘటన రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. ఈ విషయంలో ఇప్పటికే ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలకు దిగగా.. తాజాగా కాంగ్రెస్ సంచలన నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలను స్వయంగా పరిశీలించేందుకు బస్సు యాత్రను ప్రారంభించబోతున్నది. ఈ మేరకు రేపు (బుధవారం) హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఏడు మండలాలకు సంబంధించి రైతులు, మేధావులు, యువకులు పాత్రికేయులు, కాంగ్రెస్ పార్టీ నాయకులను కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్తామని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టుల్లో రోజుకో లోపం బయటపడుతోందని.. అందవల్లే ఈ ప్రాజెక్టులోని సాంకేతిక సమస్యలు, అసలు వాస్తవాలను ప్రజలకు చూపించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. గతంలో ప్రాజెక్టు నిర్మాణం సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనేక మంది విందు, వినోదాల కోసం ప్రజలను కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకు తీసుకువెళ్లారని గుర్తు చేశారు. అయితే ఈ ప్రాజెక్టులోని లోపాలను ప్రజలకు వివరించేందుకు తాము ఇప్పడు సందర్శనకు వెళ్తామన్నారు.
బీఆర్ఎస్ పార్టీ తన ప్రచారార్భాటానికి ఉపయోగించుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు నాణ్యత లోపం, ప్రజాధనం వృథా స్పష్టంగా కనిపిస్తున్నాయని దీనిపై విచారణ జరిపించడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వెనుకంజ వేస్తుందని పొన్నం ధ్వజమెత్తారు. వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చేందుకు హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు, మేధావులు, యువకులు, రేపటి సందర్శనకు తరలి రావాలన్నారు.