తెలంగాణలో మరో మెడికో ఆత్మహత్య

by GSrikanth |   ( Updated:2023-06-04 15:15:50.0  )
తెలంగాణలో మరో మెడికో ఆత్మహత్య
X

దిశ, వెబ్‌డెస్క్: వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రీతి ఆత్మహత్యను రాష్ట్ర ప్రజలు మరువకముందే తెలంగాణలో మరో మెడికో ఆత్మహత్య చేసుకుంది. ఖమ్మంలోని మమతా మెడికల్ కాలేజీలో మెడిసిన్ చదువున్న మానస అనే విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. ఆదివారం హాస్టల్‌లో ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటిచుకొని బలవన్మరణం చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈమె సూసైడ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed