Film Nagar: పోలీసులకు మరో గన్ అప్పగించిన మోహన్ బాబు

by Gantepaka Srikanth |
Film Nagar: పోలీసులకు మరో గన్ అప్పగించిన మోహన్ బాబు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు(Mohan Babu) తన వద్ద ఉన్న మరో గన్‌(Licensed Gun)ను పోలీసులకు అప్పగించారు. మంగళవారం ఫిలింనగర్‌ పోలీస్ స్టేషన్‌(Film Nagar Police Station)లో సరెండర్ చేశారు. చంద్రగిరిలో ఇప్పటికే ఒక గన్‌ను సరెండర్ చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. మోహన్‌ బాబు, ఆయన చిన్న కొడుకు మంచు మనోజ్‌(Manchu Manoj) మధ్య జరిగిన ఇంటి గొడవలు, మీడియా జర్నలిస్టులపై దాడి ఘటనకు సంబంధించి ఇప్పటివరకు మోహన్ బాబుపై మూడు కేసులు నమోదయ్యాయి.

ఈ విషయాన్ని రాచకొండ సీపీ సుధీర్‌బాబు(Rachakonda CP Sudheer Babu ) తెలిపారు. ఇప్పటికే మోహన్‌బాబుకు నోటీసులు కూడా జారీ చేసినట్లు సీపీ వెల్లడించారు. హైకోర్టు ఆదేశాల మేరకు విచారణకు హాజరుకావడానికి ఈ నెల 24 వరకు సమయం ఇచ్చామన్నారు. అంతేకాదు.. మోహన్‌బాబు వద్ద రెండు లైసెన్స్‌డ్‌ గన్లు ఉన్నాయని.. వీటిని సరెండర్ చేయాలని నోటీసులు ఇచ్చారు. పోలీసుల ఆదేశాల మేరకు మోహన్ బాబు తన వద్ద ఉన్న రెండు గన్‌లను సరెండర్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed