Union Cabinet: తెలంగాణకు కేంద్రం మరో గుడ్ న్యూస్.. 10 నగరాల్లో 30 స్టేషన్లకు గ్రీన్ సిగ్నల్

by Prasad Jukanti |
Union Cabinet: తెలంగాణకు కేంద్రం మరో గుడ్ న్యూస్.. 10 నగరాల్లో 30 స్టేషన్లకు గ్రీన్ సిగ్నల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కొత్త ఎఫ్ఎమ్ రేడియో స్టేషన్ల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు దేశంలోని 234 నగరాల్లో 730 ప్రైవేట్ ఎఫ్ఎం స్టేషన్ల ఏర్పాటు కోసం త్వరలోనే ఈ-వేలం నిర్వహిస్తామని కేంద్ర సమాచార, ప్రసార, రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రధాని మోడీ అధ్యక్షతన ఇవాళ జరిగిన కేబినెట్ నిర్ణయాలను ఆయన మీడియాకు వెల్లడించారు. మాతృభాషలో స్థానిక కంటెంట్‌ను పెంచడంతో పాటు కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించడంలో భాగంగా టైర్-2, టైర్ -3 నగరాలకు ఎఫ్ఎమ్ రేడియోను తీసుకెళ్తామని వెల్లడించారు. స్థానికంగా ఉన్న ప్రతిభను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టును రూపొందిస్తామన్నారు. ఇందులో భాగంగా తెలంగాణలోని పది నగరాల్లో 30 ఎఫ్ఎమ్ స్టేషన్ల కోసం ఈ-వేలం నిర్వహించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అందులో ఆదిలాబాద్ 3, కరీంనగర్ 3, ఖమ్మం 3, కొత్తగూడెం 3, మహబూబ్‌నగర్ 3, మంచిర్యాల 3, నల్లగొండ 3, నిజామాబాద్ 3, రామగుండం 3, సూర్యాపేటలో 3 స్టేషన్లు ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed