హైదరాబాద్ లో మరో నకిలీ డాక్టర్ గుట్టురట్టు!

by Disha Web Desk 5 |
హైదరాబాద్ లో మరో నకిలీ డాక్టర్ గుట్టురట్టు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ లైసెన్స్ లేకుండా వైద్యం చేస్తున్న మరో ఫేక్ డాక్టర్ ను తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్, జూబ్లీహిల్స్ ఏరియా ఫిల్మ్ నగర్ పరిధిలో అన్నపురెడ్డి రాజలక్ష్మి అనే యువతి ప్రాక్టిషనర్ గా ఎటువంటి అనుమతులు లేకుండా చాలా కాలంగా క్లినిక్ నిర్వహిస్తుంది. ఈమె నిర్వహిస్తున్న క్లినిక్ పై తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు చేపట్టారు. దీంతో ఆమె ఫేక్ డాక్టర్ గుట్టు రట్టయ్యింది. క్లినిక్ నిర్వహణకే కాకుండా ప్రాక్టిషనర్ గా కూడా తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిష్ట్రేషన్ నుంచి ఎటువంటి అనుమతులు పొందలేదని అధికారులు గుర్తించారు. తనకు తెలిసిన మందులతో వైద్యం చేస్తోందని అధికారులు తెలుసుకున్నారు. అంతేగాక ఆ క్లినిక్ లో అక్రమంగా నిల్వ చేసిన లక్ష రూపాయలు విలువ చేసే 40 రకాల మందులను స్వాధీనం చేసుకున్నారు.

Next Story

Most Viewed