కరీంనగర్ జిల్లాలో మరో సీఎంఆర్ఎఫ్ స్కామ్

by M.Rajitha |
కరీంనగర్ జిల్లాలో మరో సీఎంఆర్ఎఫ్ స్కామ్
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో ఈ మధ్య సీఎంఆర్ఎఫ్ (CMRF) మోసాలు వరుసగా వెలుగు చూస్తున్నాయి. గత కొన్ని రోజుల క్రితం నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఇలాంటి మోసం బయటికి రాగా పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసి ఆసుపత్రిని సీజ్ చేశారు. తాజాగా కరీంనగర్ జిల్లాలోని ఓ ఆసుపత్రి సీఎంఆర్ఎఫ్ పథకాన్ని దుర్వినియోగం చేస్తుందన్న ఆరోపణలు రావడంతో సీఐడీ (CID) పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆసుపత్రిలోని ఫైళ్లు, కంప్యూటర్ హార్డ్‌డిస్క్‌లను సైతం స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆసుపత్రికి పీఆర్వోను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎలాంటి చికిత్సలు చేయకుండానే నకిలీ బిల్లులు సృష్టించి, సీఎంఆర్ఎఫ్ నిధి నుంచి డబ్బు తీసుకున్నారని ప్రాథమికంగా నిర్ధారించుకున్నామని పేర్కొన్నారు. కేసులో మిగతా దర్యాప్తు కొనసాగుతోందని, మరికొంత మందిని ఇదే కేసులో అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం.

Advertisement

Next Story

Most Viewed