Teenmar Mallanna : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై మరో కేసు నమోదు

by M.Rajitha |
Teenmar Mallanna : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై మరో కేసు నమోదు
X

దిశ, వెబ్ డెస్క్ : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్ (MLC Theenmar Mallanna)పై మరో కేసు నమోదు అయింది. మల్లన్న తమ కులాన్ని కించపరుస్తూ ప్రసంగం చేశాడని ఆరోపిస్తూ కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ పోలీస్ స్టేషన్‌లో(Banswada Police Staions) శుక్రవారం రెడ్డి సంఘం సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రెడ్డి సంఘం అధ్యక్షుడు వాసన అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. చింతపండు నవీన్ అలియాస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తన స్వార్ధ రాజకీయ లబ్ధి కోసం రెడ్డిలపై ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి రెడ్డి సంఘ సభ్యులను దూషించడం సబబు కాదని, మల్లన్న పై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటీవల వరంగల్ సభలో రెడ్డి కులస్తులపై మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.

కాగా, ఫిబ్రవరి 28న వరంగల్(Warangal) వేదికగా నిర్వహించిన ‘బీసీ రాజకీయ యుద్ధభేరి’ సభలో పాల్గొన్న తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ వ్యక్తి ముఖ్యమంత్రి కావటం ఖాయమని హాట్ కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డే(Revanth Reddy) చివరి ఓసీ సీఎం అని వ్యాఖ్యానించారు. తెలంగాణకు బీసీలే ఓనర్లు అని.. బీసీల ఆర్థికంగా వెనకబడ్డారని అంటున్నారని అదేదీ నిజం కాదన్నారు. అవసరమైతే బీఆర్ఎస్(BRS) పార్టీని కొనేంత డబ్బు బీసీల దగ్గర ఉందని అన్నారు.

బీసీలకు బీ ఫారం ఇవ్వని వారితో బీసీలకు ఇక యుద్ధమేనని కీలక ప్రకటన చేశారు. అదే విధంగా రెడ్డి సామాజికవర్గాన్ని కుక్కలతో పోలుస్తూ దూషించడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపింది. మల్లన్న వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా రెడ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెడ్డి కులాన్ని కించపరిచేలా దూషించారని, అతనిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తున్నారు.

Next Story